Amritabindu_Upanishad_Meaning-in-Teluguఅమృత బిందూపనిషత్‌ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహవీర్యం కర వావహై
తేజస్వి నావధీతమస్తు | మా విద్విషా వహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః

అమృత బిందూపనిషద్వేద్యం యత్ పరమాక్షరం
తదేవహి, త్రిపాద్రామ చంద్రాఖ్యం నః పరాగతిః ||
అమృతబిందూపనిషత్‌ అనేది, ఆత్మవిద్యలో చాలా ప్రధానమైన ఉపనిషత్తు అండీ! ఇది. అత్మవిచారణలో మీరు మాట్లాడుకుంటున్న అన్ని అంశాలనీ, ఇదే ఒక ఉపనిషత్తులోనే స్పృశించారు. అన్ని అంశాలు ఇందులో వస్తాయన్నమాట! ఆత్మవిచారణకు సంబంధించి.
ఉపనిషత్తు ఏదైనా సరే, పరబ్రహ్మాన్ని నిరూపిస్తుంది. ఇందాక మీరు స్తోత్రాలలో, గురు బ్రహ్మ, గురుర్విష్ణుః .... గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ అన్నారు కదా! అంటే పరబ్రహ్మ’ – పదాన్ని నిరూపించాలని ఎప్పుడూ కూడా! పరబ్రహ్మపద నిర్ణయము ఎవరికైతే కలిగిందో, వాళ్ళు ఉచ్ఛ తమమైనటు వంటి గమ్యాన్ని చేరినవాళ్ళు అవుతారన్నమాట. జీవన్ముక్తావస్థను అనుభవిస్తూ మళ్ళా పరబ్రహ్మ పద నిర్ణయాన్ని పొందుతారన్నమాట. కాబట్టి ఆ జీవన్ముక్తానుభవాన్ని స్పష్టంగా నిరూపించేటటువంటి ఉపనిషత్తు.
ఏ ఉపనిషత్తుకైనా లక్ష్యం పరబ్రహ్మమన్నమాట! మీరు ఏ ఉపనిషత్తైనా చదవండి, దానిని కర్మకాండలో భాగంగా చూడకూడదు. ఈ ఉపనిషత్తులన్నీ కూడానూ, వేదంలోని జ్ఞానకాండలోని భాగము. కాబట్టి ఇవి కేవలము ఆత్మజ్ఞానాన్ని మాత్రమే బోధిస్తాయి. నీవు నిత్యజీవితంలో ఏ ఆచరణలో ఎలా వుండాలి?– (సోదాహరణంగా) అనేక ఉదాహరణలతోటి నిరూపిస్తాయి. ఈ అమృతబిందూపనిషత్‌ చాలా ప్రాధాన్యత వహించినటువంటి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు ... అంటే, దశోపనిషత్తులు కాకుండా ఈ ఉపనిషత్తు చదువుకోవడంలో వుపయోగం. వాటిలో అందరూ ప్రధానంగా దశోపనిషత్తులు వివరించి చెప్తూవుంటారు.
(మీకు ఇప్పుడు పుస్తకము ఇచ్చే దాంట్లో కూడా ఈ అమృతబిందూపనిషత్తునే ఇస్తున్నారు. గురు పూజా విధి’ – అని ఇప్పుడు మీకు ఇస్తున్నారు ఒకటి, మీరు ఎట్లా అయితే నిత్యపూజ చేస్తున్నారో ఇప్పటి వరకూ, అలా మీరు ఇకనుంచి గురువు గారి గురువుకి చేస్తారన్నమాట. అదే... మీరు ఆదిశంకరులనే పెట్టుకోండి, బృహద్వాశిష్ఠ సిద్ధాంతానికి సంబంధించిన శివరామదీక్షితులను అక్కడ నిన్న ఎలా అయితే గురుపూజ నిర్వహించారో, అలాగే మీరు మీ ఇంట్లోకూడా నిర్వహించుకోవచ్చు, అందులో ఏం ఇబ్బందేమీ లేదు. అయితే అందరూ ఒకే తీరుగా వుండేట్లుగా మీ అందరికీ ఇస్తున్నారు. ఈ అమృత బిందూపనిషత్‌ కూడా అందులో ఇస్తున్నారు. ఇది మీరు సాధ్యమైనంతవరకూ ఎవరికి వాళ్ళు ధారణ చేస్తే, మీ నిత్యజీవితంలో ఉపయోగపడుతుంది. అది మీకిప్పుడు తెలియజెప్తారన్నమాట! అర్థంతో సహా! అయితే మీ పుస్తకంలో మటుకు కేవలం శ్లోకాలే ఇస్తున్నారు. అర్థం ఇప్పుడు చెప్తారు. కావాలంటే ఇది 5 పేజీలే వుంది, ఈ 5 పేజీలు Xerox అయినా తీసుకోవచ్చు. ఇబ్బందేమీ లేదు.)

మురళీకృష్ణగారు: ఎక్కువగా ఇందులో మనసు గురించి, మనసుకు సంబంధించిన అవస్థలు గురించి, మనసుతోటీ, మనసు లేకుండా ఏ రకంగా చేస్తే బంధము? ఏ రకంగా చేస్తే మోక్షము అనేటువంటి దానిమీద, మనసుమీదే సాగుతుంది అంతా! ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క సమస్యని ఎత్తుకొని ఈ శ్లోకానికి తాత్పర్యరూపంలో దానిని క్రమక్రమంగా తీసుకువెళ్తారు.

1.         ఓమ్‌ మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ
అశుద్ధం కామసంకల్ప౦ శుద్ధం కామ వివర్జితం ||
            మనస్సు అనేటు వంటిది రెండు విధాలుగా వున్నది. ఎవరికైనా సరే అందరిలో కూడా. ఒక విధముగా వున్న మనస్సు పేరు శుద్ధము– అంటే పవిత్రము. దాంట్లో శుభము వుంటుంది. శుభవాసనలు వుంటాయి. రెండవ విధమైనటువంటిది అశుద్ధము– అంటే మాలిన్యమైనది. దాంట్లో అశుభ వాసనలు వుంటాయని, అపవిత్రము వంటిదని చెప్తున్నాడు. శుభము’- అంటే ఏమిటి? పవిత్రము- అంటే ఏమిటి? అశుభం’ – అంటే ఏమిటి? అంటే రెండవ చరణములో అశుద్ధం కామసంకల్పం, శుద్ధం కామవివర్జితం– అని తేల్చేశాడు.
అశుద్ధము అంటే కోరికలతోటి, కోరికలు ఎలా వుంటాయి? స్వార్థమును ఆశ్రయించి వుంటాయి. స్వార్థమును ఆశ్రయించేటి కోరికలన్నీ, స్వార్థాన్ని తృప్తిపరిచేట్టుగా వుంటాయి. దాన్ని కామసంకల్పం అంటారు. అటువంటి కోరికల్ని, అటువంటి స్వార్థాన్ని దానికి సంబంధించకుండా వుండేటువంటిది శుద్ధం’ – అన్నాడు. అదెట్లాగో నిర్వచించలేము, కామవివర్జితమ్‌’ – ఇటువంటి కోరికలు లేకుండా వుండేటువంటి మనస్సు.
రెండు మనస్సులు ఏమీ లేవు, నీ మనస్సులోనే రెండు భాగాలు కూడా మన దగ్గర వున్నాయి. రెండు భాగాలు, రెండు మనసులు కాకుండా కామ సంకల్పాలు, కామ వివర్జితంగా శుభ, అశుభ వాసనలతో కూడి మనసు... కాసేపు శుభవాసనలు పనిచేసినప్పుడు: మంచి పనులు చేయాలనీ, దైవంగా వుండాలనీ, సత్సంగం చేయాలనీ ఇట్లా అనిపిస్తూ వుంటుంది. కాసేపు ఏమౌతుంది? కామసంకల్పాలతో కూడి స్వార్థాన్ని తృప్తి పరచుకోవాలని అనుకుంటుంది. ముందు ఆ మనసుని అట్లా రెండు రకాలుగా వున్నదని చెప్పేసి ప్రతిపాదిస్తున్నారు.
మూడు గుణాలతో కూడితేనే కదా, కామ సంకల్పం అనేది? మూడు గుణాలకు సాక్షిగా వుంటే శుద్ధం. మూడు గుణాలతో కూడి పనిచేస్తే అశుద్ధం. అంతే ! అంటే, ఎక్కువగా మీరు దాని గురించి ఇప్పటికే చాలా చోట్ల, చాలా రకాలుగా చదువుకున్నారు. ఉపనిషత్తులు ఎక్కువగా వ్యాఖ్యానం చేయవు. కేవలం నిర్ణయాన్ని మాత్రమే చెప్తాయి. ఆ నిర్ణయాత్మకజ్ఞానం కలగడంకోసం అనే దశలో వున్నవాళ్ళు మాత్రమే ఉపనిషత్తులజోలికి వస్తారన్నమాట! దీనికి విచారణగా కావాలన్నా మీకు వివేకచూడమణిలో అనేక రకాల వేదాంత గ్రంథాలలో విస్తారంగా వీటిని గూర్చి వివరించారు.
అయితే మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు? మనసుకు రెండు స్థితులు వున్నాయి. ఒకటేమిటి? మూడు గుణాల బలంతో కలిసి పనిచేయడం. రెండవదేమిటి? దానికి సాక్షిగా వుండం. సాక్షిగా వున్నప్పుడు శుద్ధం, మూడుగుణాలతో కలిసి పనిచేస్తే అశుద్ధం. అలా తెలుసుకో! మనసుని.

2.        మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః
బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతమ్ ||
మీ అందరికీ తెలిసిన శ్లోకమేగా ఇది. మొదటిపాదం చెప్పుకుంటూ వుంటారు అందరూ కూడా. మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః– తరువాత శ్లోకంలో వుంది దాని రహస్యం, ఇదేమో ప్రతిపాదించినటువంటి నిర్ణయము. ఎలాగ? అనేది రెండవపాదంలో చెప్పారన్నమాట. విషయాసక్తతో వుండటమే బంధము, నిర్విషయం మనః అయితే ముక్తి.            


కేవలం ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు.

బంధం-ముక్తి”. 

మొదటి దాంట్లో ఏం మాట్లాడారు?

శుద్ధం-అశుద్ధం.

అంటే శుద్ధంప్రతిపాదించేటప్పుడే, ముక్తిని ప్రతిపాదించేస్తున్నాడక్కడ.

సాక్షిని ప్రతిపాదించేస్తున్నాడు. 

సాక్షి గురించి ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఏం చేశాడు?

నిర్విషయం.
అంటే సాక్షిగా వుండేవాడు, ఏ లక్షణాలతో వుండాలి? (( అర్థమైందా? అండీ! ))
మనం సాక్షి, సాక్షి... అంటున్నాం, ఆత్మ-సాక్షి అన్నప్పుడు, ఆ ఆత్మ-సాక్షి అనేది మీకు నిజజీవితంలో ఇలా నిరూపితం అవ్వాలి. ఏ మనస్సు అయితే శుద్ధము, అశుద్ధము అని మీరు మొదట్లో చెప్తున్నారో...
మూడు గుణాలతో కూడియున్నప్పుడు విషయాసక్తమై వున్నది.
మూడు గుణాలకు సాక్షిగా వున్నప్పుడు నిర్విషయముగా వున్నది.
నిర్విషయంగా వుంటున్నారా? లేదా? చూసుకోవాలి మనం.
విషయంఅంటూ వుంటే అన్నప్పుడే, నువ్వు వుంటున్నావు అన్నప్పుడు నువ్వున్నావనుకో! అప్పుడేమయ్యావ్‌?
బంధంతోటే వుంటావ్‌.
కాబట్టి ఒకే మనస్సుని బంధం వైపు మీరు వినియోగించవచ్చు. అదే మనస్సుని ముక్తం వైపుగా కూడా వినియోగించవచ్చు. ఆ మనస్సనేది వుండబట్టే నువ్వు మనిషివి అయ్యావ్‌. (( అర్థమైందా? అండీ! ))
మనుష్యాణాం– అంటే మనసుతో వున్నవాడు అని. మనసుతో కూడియున్నవాడు. అంటే నువ్వు మనసు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్యాణాం అంటే ఆ చివర ణాం ఇచ్చాడు కదండీ! అంటే కూడివుండడం అన్నమాట.

నువ్వు మనస్సుతో కూడివున్నావు. అది కూడా ఎటువంటి మనసు?
వికసించిన మనసుతో కూడుకుని వున్నవాడవు. (( అర్థమైందా? అండీ! ))           పరిపక్వమైనటువంటి మనసుతో కూడికునియున్న వాడవు.


ఇప్పుడా మనసును, ఆ పరిపక్వతను ఎటు వాడుకోవాలట? వికాసాన్ని?

ముక్తి వైపు వాడుకోవాలి.ముక్తి లక్ష్యంలో వాడుకోవాలి. బంధ లక్ష్యంలో కాదు.

విషయాసక్తం అవ్వడమే బంధము. నిర్విషయముగా వుండడమే ముక్తి.

మన నిత్యజీవితంలో ఏ ఆలోచనైనా రానివ్వండి, ఈ ఆలోచన వల్ల నాకు బంధం పెరుగుతుందా? తగ్గుతుందా? బంధం పెరుగుతుందనుకోండి – వదులుకోవడమే.
((అర్థమైందా? అండీ!)) అది.

మనుష్యుల యొక్క బంధమోక్షములకు కారణము మనస్సే యగుచున్నది. విషయములయందు ఆసక్తి గల మనస్సు బంధము కొరకే, విషయములయందు ఆసక్తి లేని మనస్సు మోక్షము కొరకే అగుచున్నది.
కాబట్టి మరణకాలంలో కూడా ఏది పనిచేస్తున్నది?
మనస్సే కదా! ముందు శరీరం పడిపోతుంది, తర్వాత ప్రాణం పడిపోతుంది, తర్వాత మనస్సే కదా పడిపోయేది. ఆ ప్రాణమనస్సులే కదా జీవుడని పిలుస్తున్నారు మీరు.

ఆ మనస్సు పడిపోయేటప్పుటు కూడా మీరు ఏ దశలో వుండాలట అప్పుడు?  మరణకాలంలో కూడా, నిర్విషయం మనః. అసలు నిర్విషయంగా వున్నదాని పేరే మనస్సని పేరట.

ఇప్పుడు మనస్సుఅని దేనిని అంటున్నావు?
విషయాలతో కూడుకున్న దానిని మనస్సు అంటున్నావు. అలా అనడంలేదు శృతులు, ఉపనిషత్తేమంటుందంటే – నిర్విషయముగా వున్నదేనండీ అసలు మనస్సు అంటే.

ఆలోచనా రహితముగా వున్నటువంటి మనస్సేదో, అదే మనస్సు.
మేఘావృతము కాని ఆకాశమేదో, అదే నిజమైన ఆకాశము.

మేఘాలను ఆకాశము అనవచ్చా?
ఉప్చ్‌. (అనరాదని భావము).

అలాగే ఆకాశంలో ఆ మేఘాలు ఎలాగైతే వచ్చిపోతున్నాయో, అలాగే నీ మనసులో విషయాలు, ఆలోచనలు, సంకల్పాలు వచ్చిపోతున్నాయి. ((అర్థమైందా? అండీ!)) కాబట్టి, మధ్యలో వచ్చిపోతున్నటు వంటి మేఘాల వంటివే కాని అవి ఆకాశం కాదు అన్నమాట. ఇందాక ప్రార్థనలో బ్రహ్మానందం పాడినప్పుడు అందులో ఏం చదివారు? గగన సదృశం కదా!

ఆ గగన సదృశముగా ఎవరుండాలి? ఇప్పుడు. శరీరమా? ప్రాణమా? మనసా?
మనస్సు.
అది, కాబట్టి మనస్సును ఎప్పుడూ ఆకాశం వలె ఉంచాలన్నమాట!
ఎటువంటి ఆకాశం మళ్ళా?
నిర్మలాకాశం. ((అర్థమైందా? అండీ!)) మేఘాలు లేని ఆకాశం అన్నమాట.

విషయాలు లేని మనస్సు. నిర్విషయంగా వున్న మనస్సు.

మనం అసలు నిర్విషయంగా ఎప్పుడైనా వుంటున్నామా?
వుండటం లేదా?
(నిద్రలో వుంటున్నామండీ!)

మీరెవ్వరూ మిమ్మల్ని మీరు అధ్యయనం చేసుకోవడం లేదు. మెలకువలో కూడా మీరు ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు కానీ, ఆలోచనకి – ఆలోచనికి మధ్య ఎంతో gap వుంటుంది. మాటకి – మాటకి మధ్య ఎంతో gap వుంటుంది.

ఆ సమయంలో ఎక్కడుంది మనస్సు ఇప్పుడు?
నిర్విషయం మనః

అయితే అక్కడొక చిక్కుంది. ఆనందాసక్తత (ఇందాక ఉదయం కూడా చెప్పాం) ఆనంద అపేక్ష గనుక వున్నటు వంటి మనస్సు అయితే ఆనంద అపేక్ష అనే ఒక్క విషయం చాలట అనేక విషయాలు అవ్వడానికి.

కాబట్టి ఇప్పుడు మనలో వున్న అపేక్ష ఏమిటి?
నేను ఆనందంగా వుండాలి’ – అన్న ఒకే ఒక అపేక్షే నిన్ను జీవుడిని చేస్తుంది.

ఇప్పుడు ఆనందంగా వుండకూడదా? ఏమిటి తేడా? ప్రపంచంలో అందరూ ఆనందంగా వుండాలనే కదా కోరుకునేది అండీ? మీరేంటి వ్యతిరేకంగా చెప్తున్నారు?

ఏం చెప్తున్నారంటే కారణ సహిత ఆనందము, కారణ రహిత ఆనందము.
అక్కడ ఇప్పుడు బంధం-ముక్తులు ఎలా అయితే చెప్తున్నారో ఒకే మనస్సుకి, ముక్త దశలోనేమో కారణ రహిత ఆనందంగా వున్నావు. బంధ దశలోనేమో కారణ సహిత ఆనంద అపేక్షలో వున్నావు. ((అర్థమైందా? అండీ!)) కాబట్టి, ఒకే మనః స్థితిలోనే ఈ రెండు ఒకే చోట వున్నాయి. వీటిని ఎటువైపు వాడుతున్నావనే విజ్ఞత నీలో వుండాలి. విజ్ఞత నీకు లేక పోబట్టి, దోషాన్ని మనసు మీద ఆరోపిస్తున్నావు. అంతా సమస్య మనస్సుతోనేనండీ!’ అంటున్నావు.

సమస్య మనస్సుతోటా? నీతోటా?
నీ తోటే. ఎందుకంటే దానిని అనుమతిస్తుంది నువ్వేగా. దానిని బంధం వైపు ఎవరు అనుమతించమన్నారు నిన్ను? విషయాసక్తతవైపు ఎవరు అనుమతించమన్నారు నిన్ను? నీ అనుమతి లేకుండానే అది ప్రవర్తిస్తోంది అంటే? దానికి ఎంత స్వేచ్ఛ నిచ్చావు? కాబట్టి, ఆ స్వేచ్ఛను వైరాగ్యబలంతో వెనక్కు తీసుకో. వివేకంతోటి వినియోగించు.

3.        యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తి రిష్యతే,
అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా ||
ఏ కారణము చేత విషయాసక్తము కాని మనస్సునకు మోక్షము చెప్పబడియున్నదో, ఆ కారణముచే ముముక్షువు చేత సదా మనసు విషయరహితమైనదిగా చేయదగినది.

((అదిట సంగతి)) మనము అందరం ముముక్షువులం అంటే మోక్షాసక్తి కలిగిన వాళ్ళమే గనుక అయినట్లయితే రోజంతా ఏం చేయాలి? 24 గంటలు ఏం చేయాలి? ఒక పని చేయాలట. విషయాసక్తతకు మనసు లోబడకుండా చేయాలి. అప్పుడు మాత్రమే నీవు ముముక్షువు అనిపించుకోవడానికి వీలౌతుంది. నేను కేవలం సాధనలో వున్నానండీ, విచారణ చేస్తున్నానండీ, సత్సంగానికి వెళ్తున్నానండీ, ఇలా మీరు ఎన్ని రకాలుగా చెప్పినా, అది నీకు నిజంగా ఫలితాన్ని ఇవ్వదు. నిజంగా ఎప్పుడు ఫలితాన్ని ఇస్తుందట? నీ మనసుని నువ్వు విషయాసక్తం కాకుండా చేయగలిగినప్పుడు మాత్రమే, విషయరహితంగా నీ మనసుని వుంచగలిగినప్పుడు. ఆలోచనారహితస్థితిలో నీవు వుండాలి. నిర్వాణంఅంటారన్నమాట దానినే. ఆ ఆలోచనారహిస్థితి పేరే నిర్వాణము.
ఈ నిర్వాణ స్థితిలో నీవు గనుక వున్నట్లయితే, అప్పుడు మాత్రమే నీకది, నీ మరణకాలంలో నీకు ముక్తావస్థలో, నీకు సహజంగా వుపయోగపడుతుంది. గాఢనిద్రావస్థలో కూడా నీవు నిర్విషయం మనః విషయాసక్తత లేకుండా వుంటావు. ఆనంద అపేక్ష లేకుండా వుండాలి. ఆ సాక్షి, గాఢనిద్రయందు ఏ సాక్షి వున్నాడో ఆ సాక్షి మీద దృష్టి వుంచి, మెలకువలో చేయాలి. మెలకువలో పూర్తిగా సాక్షిగా వుండగలిగినప్పుడే, మిగిలిన రెండవస్థలలో వుండగలుగుతారు.

నిద్ర వుంటే మెలకువ వుందా? మెలకువ వుంటే నిద్ర వుందా?
దేని మీద ఏది ఆధారపడి వుందండీ?
నిద్ర సహజమా? మెలకువ సహజమా?
మెలకువ వుంటే నిద్ర వుందా? నిద్ర వుంటే మెలకువ వుందా?
ఒకటుంటే రెండవది వుందా?
వెలుగుంటే చీకటుందట, చీకటుంటే వెలుగు లేదట.
వెలుగేగా చీకటిని సృష్టించింది? మరి?
ఏంటో ఎక్కడో తికమకగా లేదు? అవునా? కాదా?

ఈ రెండిటిలో ఏది సత్యం?
ఈ ప్రపంచంలో ఎవరైనా గానీ మేల్కొన్నానుఅన్నారంటే, ఎక్కడినుంచి మేల్కొన్నారు?
(నిద్రలోనుంచి)

మెలకువలో వున్నవాడు ఎప్పుడైనా కానీ, నేను నిద్రపోతున్నాను అని చెప్తాడా? (అర్థమైందా?) కాబట్టి, మీలో ఏది సహజమైనటువంటి పని?
నిద్ర. (అర్థమైందా? అండీ!) సహజమైనపని నిద్ర. కాబట్టి మెలకువయే అసహజం. మనం మెలకువలో బలంగా వున్నామని మన అభిప్రాయం. మన ప్రజ్ఞా ధురీణత అంతాకూడాను, మనకా capacities అంతాకూడాను మెలకువలోనే వున్నాయని మన అభిప్రాయము. సత్యం కూడా అదే. గాఢనిద్రావస్థలో కూడా నీకు తెలివిపనిచేసినప్పుడు నువ్వు, ఆ నిద్ర ప్రభావం కూడా విషయావృతం కాకుండా వుంటుందన్నమాట. అప్పుడు నిద్రకూడా ఒక విషయమే అయిపోతుంది. దానికి ఆ ప్రాధాన్యత తగ్గిపోతుంది.

మెలకువలో ఎట్లా అయితే విషయాలను మార్చేసినప్పుడు, ఒక విషయం గురించి మరోవిషయంలో ఏమన్నా బాధపడ్డావా?
బాధ పడలేదు కదా!

బాల్య విషయాల గురించి ఇప్పుడేమన్నా బాధపడుతున్నావా? ఏ? (ఎందుకని?)
అయిపోయిందండీ, దాటేసాను. (అన్నావు).

అట్లాగే నిద్రకూడా ఒక విషయం లాంటిదే. కాసేపు వుండిపోయేదే. నేను నిద్రావస్థలో లొంగిపోయేవాడను కాదు. మునిగిపోయేవాడను కాదు. నేను నిద్రకు సాక్షిని. నేను విషయరహితుడను. అనే సాక్షి స్వరూపంలో నీవు నిలబడి వుండాలి. అప్పుడు మాత్రమే నీవు ఎవరౌతావు? ముముక్షువు. తురీయ స్థితి అనే లక్ష్యాన్ని స్వీకరించి, మెలకువ-కల-నిద్ర మూడింటిలో ఎవరైతే జీవిస్తారో, వాళ్ళే ముముక్షువులు. ఈ తురీయానుభవం చాలా ముఖ్యం. ఈ తురీయ లక్ష్యాన్ని స్వీకరించి, ఏ పనైనా చేసినవాళ్ళు ఎవరైతే వుంటారో, వాళ్ళు సాధకులు.
నిర్విషయంగా వున్నదే ముక్తి అన్నాడు కాబట్టి, ముముక్షువులు అయిన వాళ్ళు నిర్విషయం చేసుకుంటే ముక్తుడౌతాడు. చాలా ప్రధానం అన్నమాట. సిద్ధాంతం చెప్పి, సిద్ధాంత ప్రకారంగా లక్ష్యం చేసినప్పుడు, నువ్వేం చెయ్యాలో కూడా చెప్తున్నాడన్నమాట.

            4.        నిర స్తవిషయా సఙ్గ౦ సంనిరుద్ధం మనో హృది
యదా యాత్యాత్మన్యో భావం తదా తత్పరమం పదమ్‌ ||
ఎప్పుడు విషయముల యందలి ఆసక్తిని విసర్జించిన వెంటనే, హృదయమునందు చక్కగా నిరోధింపబడిన మనస్సు, సదా ఆత్మరూపమును పొందినదగుచున్నదో, అప్పుడది ఉత్తమోత్తమమైన స్థానం అగుచున్నది.

విసర్జించటం అంటే?
(వదిలి వేయటం)

ఆర్జించటం అంటే?
(సంపాదించడం) ప్రయత్నపూర్వకముగా. ప్రయత్నపూర్వకముగా చేయడాన్ని ఆర్జించటం అంటారు. ఆర్జించటనానికి ఎంత కష్టపడైతే అన్నిటిని ఆర్జిస్తున్నావో, అంతకంటే విశేషంగా, ప్రయత్నపూర్వకంగా వదిలెయ్యాలి దానిని. అది విసర్జించడమంటే అర్థం అది. విశేషమైటువంటి ప్రయత్నంతో వదలవలసినవి.

మామూలు ప్రయత్నంతో పోతాయా?
(ప్చ్‌) (పోవు అని భావము).

మనం సాధ్యమైనంతవరకూ, విషయాలను పోగొట్టుకునేందుకు మనం జీవిస్తున్నామా? విషయాలను పెంచుకునేందుకు జీవిస్తున్నామా?
(పెంచుకోవడానికి)

(అర్థమైందా? అండీ!) ఇప్పుడు మనమందరం ముముక్షువుల category లోకి వస్తామా?
(రాము). కాబట్టి, ముక్తి లక్ష్యంతోటి జీవించే వాళ్ళు, ఒకటే పనిట, వాడి జీవితం మొత్తం ఒకటే పని చేయాలి. నిర్విషయం మనః. (అర్థమైందా? అండీ!) ఆ విషయాసక్తతకి మనసు గురి అవకుండా చేయాలి. పదే పదే మూడు శ్లోకాలనుంచి అదే చెప్తున్నాడా? లేదా? ఇందులో ఇంకా స్పష్టంగా చెప్పాడు.

ఏం చెప్పాడు?
ఏమి చెయ్యాలో చెప్తున్నాడు, ఇక్కడ. పై రెండు శ్లోకాలలోనేమో సిద్ధాంతం చెప్పాడు, రెండవ దాంట్లో దాని ప్రభావం చెప్పాడు, మూడవ దాంట్లో ఏం చెప్తున్నాడిప్పుడు? ఏం చెయ్యాలో చెప్తున్నాడు. ప్రయత్నపూర్వకముగా దానిని (విషయాలను) వదులుకో– (అర్థమైందా? అండీ!)
మళ్ళా ఒకసారి చదవండి భావం.
ఎప్పుడు విషయముల యందలి ఆసక్తిని విసర్జించిన వెంటనే, హృదయమునందు చక్కగా నిరోధింపబడిన మనస్సు, సదా ఆత్మరూపమును పొందినదగుచున్నదో, అప్పుడది ఉత్తమోత్తమమైన స్థానం అగుచున్నది.

మనస్సు నిరోధించబడినప్పుడు, ఇప్పుడు ఎక్కడికి చేరిందట? అంటే నిర్విషయం మనః అనే స్థితిలో ఎక్కడ వుందట ఈ మనస్సు వెళ్ళి?
హృదయస్థానంలో వుంది.

ఆ హృదయస్థానంలో ఎవరున్నారు?
నేను.

అక్కడెవరున్నారండీ?
నేను’. ‘యథార్థ నేనుఅన్నమాట అది.

మనసులో ఎవరున్నారు?
ప్రతిబింబనేను వున్నాడన్నమాట.

బింబనేను ఏమో హృదయంలో వున్నాడు. (అర్థమైందా అండీ!) ఇందాక చెప్పారు కదా!

ప్రతిబింబ-బింబ న్యాయం.
ప్రకాశించేటటువంటి సూర్యుడు - బింబం.
ప్రతిబింబించేటటు వంటి ఆభాస – జీవుడు. (అర్థమైందా? అండీ!) కాబట్టి,

మనలోకూడా ఇప్పుడు ఈశ్వరుడుఉన్నాడా? లేడా?
ఉన్నాడు.

ఎక్కడున్నాడు?
హృదయస్థానంలో వున్నాడు.

ఆ హృదయస్థానాన్ని కనుక్కోవడం ఎట్లా?
నీకు ప్రాణంగాని, మనసుగాని రెండే పనిముట్లు. నీ లోపల నీవు వెతకడానికి. అంతేనా? కాదా? (ఈ రెండు) ప్రాణమనస్సులు ఎక్కడనుంచి పుడుతున్నాయో, ఎక్కడ లయిస్తున్నాయో ఆ స్థానం పేరు హృదయము అని పెద్దలు నిర్ణయం చేశారు. కాబట్టి నీ ప్రాణాన్నిగానీ, నీ మనస్సునిగానీ విచారణ చేస్తూ నువ్వు లోపలికి వెళ్ళినట్లయితే, ఎక్కడైతే ప్రాణమనస్సుల యొక్క కదలికలు ఆగిపోయినాయో ఆ స్థానం పేరు హృదయస్థానం.


అక్కడ ఏమున్నాయయ్యా?

విషయాలు లేవు. నిర్విషయం మనః. మనసు సహజస్థితిలో వున్నది. ఆ హృదయస్థానంలో నీవు సదా నిలిచివుండడం అనే సాధన చేయాలి.

సదా’… అంటే?
ఎల్లప్పుడు.

ఎల్లప్పుడూ... అంటే?
మూడు అవస్థలలో. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. సదా అంటే మూడు అవస్థల్లోనూ, నీవు హృదయస్థానంలో వుండి చరించాలి.

అప్పుడు నువ్వు ఏమౌతావు?
నీ మనస్సు సహజస్థితిలో వుంటుంది.

కాబట్టి, ముందు మెలకువలో ప్రయత్నించాలా? నిద్రలో ప్రయత్నించాలా?
మెలకువలోనే ప్రయత్నం చేయాలి.

ఎందుకని?
గుర్తించగలిగే సామర్థ్యము, తెలివి పనిచేస్తుంది కాబట్టి.

కాబట్టి, నీ మనస్సుని అనుసరించి నీ లోపలికి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఒక దగ్గరకు వెళ్ళేటప్పటికి, మనసుకాస్తా, విచారణ చేసే మనసు ఒక దశలో ఆగిపోయింది. ఆ ఆగిపోయిన స్థానంలో నీవు, నిర్విషయంగా వున్నావు. అలా నీవు నీ హృదయస్థానంలో సహజంగా వుండాలి. అన్ని (మూడు అవస్థలలో) కూడా వుండాలి.

అప్పుడు దేనికి అర్హత వస్తుంది నీకు?
ముముక్షుత్వానికి అర్హత వస్తుంది. ముముక్షుత్వం, ఈ ప్రయత్నం, ఈ సాధన చేసేవాడెవడో వాడు ముముక్షువు. వాడికి ముక్తి లక్ష్యం మీద దృష్టి వున్నట్లు లెక్క. వాడికి తురీయం అనే దానిమీద లక్ష్యం వున్నట్లు లెక్క. (అర్థమైందా? అండీ!)

మీరు ఏరోజుకారోజు, (ఇందాక చెప్పాను) లేస్తూనే ఏం తెలుసుకోవాలట?
ఎందుకు పుట్టాను? ఎందుకు నిద్ర లేచాను? (అర్థామైందా? అండీ!)

ఎందుకు నిద్ర లేస్తున్నావ్‌?
నిర్విషయం మనః’.

ఈ రోజు మొత్తం మీద నేను నిర్విషయ స్థితిలో ఎంతసేపు వున్నాను?

(నిర్విషయం మనః స్థితిలో) లేవు, అంటే ఏమైపోయినట్లు, ఆ కాలం?
ముముక్షువుగా లేవు. సాధకుడిగా లేవు. (అర్థమైందా? అండీ!) బంధం పెంచుకున్నావు. ఇలా ఎవరైతే ఏరోజుకారోజు విచారణ చేసి, నిర్విషయం మనః అనే స్థితిలో స్థిరంగా వుంటారో, వాళ్ళు ముముక్షువులు. కాబట్టి ఇప్పుడు సాధన ఏం చేయాలో స్పష్టంగా తెలిసిందా?  

విషయాసక్తి నుంచి విడవడినటువంటి మనస్సు హృదయానికి తీసుకెళ్తుంది. హృదయం నందు చక్కగా వుండి, మళ్ళీ మనసు విజృంభించకుండా నిరోధింపబడ్డప్పుడు అది ఆత్మరూపం పొందుతుంది” – అని చెప్తున్నాడు.
ఇంకో పరిణామం చెప్తున్నారు చూడండి. నిర్విషయం మనః అక్కడున్నావు. హృదయస్థానంలో వున్నావు.

ఇప్పుడు మీ అందరికీ ఆత్మసాక్షాత్కార జ్ఞానం కావాలా? వద్దా?
కావాలి కదా!

ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచేనా?
ఆఁ... ఆకాశ స్థానం పేరే హృదయం. సత్యమే అది.

పంచభూతాలకి అవతలనుంచేనా వచ్చేది, అది?
అక్కడినుంచే వచ్చేది అది. సాక్షిస్థానం అక్కడే వుంది. అది హృదయ పరిధిలో వుందన్న మాట. నీ మనస్సు, ప్రాణము ఎక్కడైతే కదలకుండా వున్నాయో, ఆ స్థానంలో గనుక నీవు నిలిచి వున్నట్లయితే, అలా కొద్దికాలం వుండగా, ఈ ప్రాణమనస్సుల యొక్క శక్తులు రెండూ కలిసిపోతాయి.

ఆ హృదయస్థానంలో ఏమున్నాయండీ?
ప్రాణశక్తి, మనఃశక్తి రెండూ కలిసిపోతాయి. కలిసిపోయి మూడవస్థలలోనూ ఎప్పుడైతే నీవు నిర్విషయ స్థితిలో వుండగా, వుండగా... ఈ రెండు శక్తులు కలిసిపోయి ఏకమైనటువంటి దశలో, నీకు ఆత్మరూపాన్ని పోందుతుంది. అంటే స్వయం ప్రకాశకమైనటువంటి రూపాన్ని పొందుతుంది. అప్పుడే నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. ప్రాణచలనము, మనోచలనము విజృంభించి వున్నంతవరకు ఎవరూ తమ యొక్క స్వరూపజ్ఞానమును తెలుసుకోలేరు.

అంటే, హృదయ స్థానాన్ని చేరిన తరువాత, ఏం చేయాలంట ఇప్పుడు? మళ్ళా ఇవి విజృంభించవా?
విజృంభిస్తాయి.

(ప్రాణ మనస్సులు) దేని వల్ల? (విజృంభిస్తాయి)
పూర్వ అభ్యాసబలం వల్ల, గుణబలం వల్ల, విషయాల్లో బలం వల్ల, కర్త వల్ల, భోక్త వల్ల అబ్బో ఎన్నైనా చెప్పవచ్చు అట్లా.    

అవన్నీ విజృంభించకుండా ఏం చేయాలట ఇప్పుడు?
నిరోధించాలి.

ఎట్లా నిరోధిస్తావు?
(అణచటం కాదు నిరోధించాలి)  నిరోధించాలి.

నిరోధము అంటే ఏమిటి? (అన్ని సంస్కృత పదాలు, వచ్చిన చిక్కది) నిరోధమంటే ఏమిటి?
రోధము అంటే అడ్డగించుట.
నిః+రోధము= నిశ్శేషముగా రోధము. ఒక్క విషయాన్ని కూడా మిగల్చకుండా.

దాన్నేంచేయాలట?
ఒక్క విషయాన్ని మిగల్చకుండా అడ్డగించాలి. అంటే ఆసక్తతని పోగొట్టాలి.

విషయంలోకి ఎందుకు వస్తుంది? ఎందుకు విజృంభించింది?
(ఆసక్తి ఉండబట్టి విషయంలోకి వచ్చింది మనస్సు) ఆసక్తి వివేకంతో పరిష్కరించాలి. (అణచటం కాదు, తొక్కిపట్టటం కాదు).

అంటే అర్థం ఏమిటి? చాలా మంది ఏం చేస్తున్నారు?
కోపం వస్తుంది, పళ్ళ బిగువున ఆపుకుంటారు. (అది నిరోధము కాదు).

ఏమైందప్పుడు?
అది నిరోధము కాదన్నమాట! కుండ ఎప్పుడోకప్పుడు పగులుతుంది. అలా పట్టుకుంటే. దుఃఖం వస్తుంది. కానీ ఆపుకుంటారు. నీకు లోపల దుఃఖం వచ్చిందా? రాలేదా? వచ్చేస్తే ఏమైంది? నువ్వు బయటకి వ్యక్తీకరించిన, వ్యక్తీకరించకపోయినా పెద్ద భేదమేమీ లేదు. మనోపరిధిలో జరిగిపోతే అంతా జరిగిపోయినట్లే. (అర్థమైందా? అండీ!). మీరు లోపలికి వచ్చారు, అలా చూశారు, అక్కడేదో ఒక వస్తువో, ఒక పండో ఫలమో కాయో వుంది. ఇది నాకు ఇస్తే బాగుండు అనుకున్నారు. ఏమైందప్పుడు? నీకు ఇవ్వలేదు, కానీ మనోపరిధిలో ఏమైపోయింది? ఆ వస్తువును అనుభవించేశావు. ఇది విషయము అంటే అర్థం. ఇలా
మనకు తెలియకుండా లోపల విషయము పనిచేస్తుందా? పనిచేయడం లేదా?
(పని చేస్తుంది). దీన్ని ఇక్కడ దెబ్బకొట్టాలన్నమాట. (అర్థమైందా? అండీ!)

గాఢనిద్రావస్థలో ఏదైనా కోరుతున్నావా?
(లేదండి)
అలా వుండాలి మెలకువలో.

అలవాటైనా పర్వాలేదు, అభ్యాసం అయినా పర్వాలేదు అంటాడు. ఎందుకనిట?
ప్రారంభ దశలో అభ్యాస, వైరాగ్యాలతోనే దానిని నిరోధించాలి, వేరే మార్గం లేదు. గురువుగారు చెప్పారని ఒక నియమం పెట్టుకో!
ఈ సృష్టిలో నేను బ్రతికి వున్నంత వరకు, చేయిచాచి నేను ఎవరినీ ఏదీ అడగను.

ఒక వేళ నన్ను ఎవరైనా ఇది కావాలా? అని అడిగితే, ఏం సమాధానం చెప్తావు? నీకిది కావాలా అని అడిగారనుకోండి ఎవరైనా? ఏం చెప్తావు? వద్దని చెప్తావా?
అవసరం లేదు. (అని చెప్పగలగాలి, చెప్పాలి అని అర్థము.)

వద్దంటే ఏమైంది?
అందులో కావాలి వుంది. ఈ సమయానికి వద్దని అర్థం. అంటే మరో సమయంలో కావాలని వుంటుందన్నమాట. అంటే విషయాన్ని బ్రతికిస్తున్నావు అక్కడ.

అవసరం లేదు” – ఏమైందప్పుడు?
నిర్మొహమాటంగా చెప్పడమే అన్నమాట.

ఎవరికి చెప్తున్నావు?
నీ మనసుకే. నీ ఆసక్తతను పోగొట్టే ప్రయత్నం చేస్తున్నావు.

భార్య: ఏవండీ! కొత్త బట్టలు కొందాం రండీ!
సాధకుడైన భర్త: అవసరం లేదు.

(ఇప్పుడు వద్దులే అనకూడదు) ఇప్పుడొద్దులే అంటే అర్థం ఏమిటి?
ఇంకోసారి కొంటామని అర్థం అన్నమాట. మనం ఎప్పుడూ ఇలా సశేషంమిగులుస్తాం. అందుకని నిరోధంఅన్న పదం వేసిందండి అక్కడ.

మీరందరూ మీ విషయాలని అడ్డుకుంటూనే వున్నారు, కానీ ఎట్లా అడ్డుకోవడం లేదు?
నిరోధించడం లేదు. నిశ్శేషముగా రోధించడం లేదు. శేషం మిగులుస్తున్నావు.

ఒకపని చేస్తావా? అంటే
ఇప్పుడు చేయనులే అంటాడు.
ఇప్పుడు చేయనులే అంటే అర్థం ఏమిటి?
ఇంకోసారి చేస్తామని అర్థం, అది అట్లా చేస్తే నువ్వు ముముక్షువువి అవ్వవు. (అర్థమైందా? అండీ!) ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీలోని ఆసక్తతని పరిష్కరించేదే సాధన అంటే. మీ బయిట ప్రపంచాన్ని పరిష్కరించేది కాదు. నీ పక్కన వున్నవాడికి చెప్పడానికి పనికొచ్చేది అంతకంటే కాదు.

మనం అన్నీ ఎవరికి చెప్తాం?
పక్కవాడికి చెప్తాం. నువ్వు అలా వుండు, నువ్వు ఇలా వుండు అని.
వాడేం అంటాడు?
నవ్వుండి చూపెట్టు అంటాడు. (అర్థమైందా? అండీ!) కాబట్టి వాడు కూడా నీకు గురువే. వాడు కూడా ఏం బోధిస్తున్నాడు?
నిర్విషయం మనః, ముందు నువ్వు నిర్విషయముగా వుండు మొట్టమొదట. ఎవరికో చెప్పడానికి పనికిరాదిది. (అర్థమైందా? అండీ!)
కాబట్టి మొట్టమొదట అభ్యాసం ఏం పెట్టుకోవాలి?
అవసరాలను తగ్గించుకుంటూ పోవాలి.

ఎవరైనా ఏదైనా కావాలా అని అడిగారనుకోండి’ – ఇప్పుడు ఇది ఎవరు అడుగుతున్నారు నిన్ను?
సృష్టి అడుగుతోంది. (అర్థమైందా? అండీ!)
ఆఖరి ప్రశ్న కూడా, మరణ వేదన కాలంలో ఇదే వుంటుందన్నమాట!

నీకు శరీరం కావాలా?
అవసరం లేదుఅని చెప్పగలిగే సామర్థ్యం రావాలన్నమాట అభ్యాసబలం వల్ల. అందుకు అభ్యాసం చేయటం. (‘బ్రతికితే బాధగా వుంది కాబట్టి పోనీ అనికాదు).
ఏం బ్రతుకుతాం లేండీ, ఈ శరీరం తోటి? అని నీరసంతోటి అడిగితే అలాగే తీసుకుంటుందప్పుడు. ఈసారి ఆరోగ్యంతోటి వస్తావన్నమాట. అంతే, అంతకుమించి తేడా ఏమీ వుండదు. కొంతమంది చెప్తారు చూడండీ, చిన్నప్పటి నుండి ఇప్పటివరకూ నేను హాస్పిటల్‌కు వెళ్ళలేదని, ఏంటట గొప్ప అయితే? అదన్నమాట అండీ, ఇట్లా.. ఈ జన్మలో ఒకదాని చేత బాధించబడుతూ వుంటే, ఆ బాధల వల్ల శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకోవడం చేత, నీకు ముక్తి రాదు. నిశ్శేషంగా దాన్ని ఆపాలి. కాబట్టి నిర్విషయం మనః అన్నదానికి ఇంత ప్రాధాన్యత వున్నదన్నమాట. మీ మనస్సును మీరు ఇంత శ్రద్ధగా పట్టించుకోవాలని అర్థం. ఏదో వచ్చిందిలే పోయిందిలే అని అనుకోమాకండి. హృదయస్థానంలో స్థిరంగా నిలబడి వుండాలి. విషయాన్ని నిర్విషయం చేయాలి. ముముక్షువు అనేవాడు. చాలా ముఖ్యం. అత్యంత శ్రద్ధతో చేయవలసినటువంటి పని. బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏదైనా సరే ఒక పనిని అత్యంత శ్రద్ధతో, నూటికి వెయ్యిపాళ్ళు శ్రద్ధతో చేయవలసిన పని ఏదన్నా వుందంటే, మనస్సుని నిర్విషయం చేయడమే అత్యంత శ్రద్ధతో చేయవలసినటువంటి పని.

కఠినమైన నిర్ణయాలు జీవితంలో ఎక్కడైనా తీసుకోవలసిన అగత్యం అంటూ వస్తే, ఎక్కడ తీసుకోవాలండి?
నిర్విషయం చేయడంలోనే తీసుకోవాలి. నీ వైరాగ్యబలం, నీ అభ్యాసబలం, నీ కాఠిన్యం, నీ వివేకం, నీ చిత్తశుద్ధి, నీ శ్రద్ధ అన్నీ ఇక్కడ ఉపయోగపడుతాయి. అన్ని శక్తులను ఇక్కడ వాడవలసిందే. ఏది పరిష్కారంగా చేస్తే, ఏది వాడితే నువ్వు దానిని నిర్విషయం చేయగలవో, దాన్ని వాడి నిర్విషయం చేయవలసిందే ఇక్కడ. ఇది ఎవరికి వారు చేయవలసిందే. ఇక్కడ ఈశ్వరుడు గాని, గురువుగాని నీకేమీ సహాయపడరు. నిర్విషయం మనః అయిన తరువాత నుంచి సహాయపడుతారు ఇక. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది ముందు సాగిల పడ్డా, ఎన్నిసార్లు పడిలేచినా, మోకాళ్ళ దండాలు పెట్టినా, పొర్లు దండాలు పెట్టినా ఈశ్వరుడు గానీ, గురువుగానీ నిర్విషయం మనఃఅయ్యేంత వరకూ ఏ సహాయం నీకు చెయ్యలేరు.

చెయ్యలేరా నీవు తెలుసుకోలేవా?
తెలుసుకునే శక్తి వుండదు.

నీ హృదయస్థానంలో నీవు వున్నప్పుడు మాత్రమే, సహజంగా స్వచ్ఛంగా వున్నప్పుడు మాత్రమే, ఆ సూర్యుని యొక్క సాక్షిత్వాన్ని నువ్వు గుర్తించగలుగుతావు నీలోపల. అర్థమైందా అండీ! ఆ స్వప్రకాశజ్ఞానాన్ని పొందిన దగ్గర నుంచి సంపూర్ణంగా ఈశ్వరుడి మీద, గురువు మీద ఆధారపడటం నేర్చుకుంటావు. మనో పరిధిలో వున్నంత వరకూ నీవు అలా ఆధారపడి వుండవు. నా కృప నీకు చాలును” – అనే బైబిల్‌ వాక్యము వుంది. ఆ కృప వరకు సరిపెట్టుకునే దశలో వుండవన్నమాట. నాకు ఈ సృష్టిలో ఏదో ఒకటి కావాలి అని అడుగుతూనే వుంటావు.

సృష్టికి సంబంధించినది అయినంత వరకూ ఏదైనా సరే ఏమి answer చెప్పాలట నువ్వు ఇప్పుడు?
అవసరం లేదు. (అర్థమైందా? అండీ!)
అది కూడా ఎలా చెప్పాలి?
హృదయస్థానంలో నిలబడి, వుండి చెప్పాలి. అవసరం లేదు పో!” (కఠువుగా.. ఇలాకాదు) అది కూడా అవసరం లేదనే. (అర్థమైందా? అండీ!) మన ప్రవర్తనే జ్ఞానాన్ని నిరూపించాలి. (అర్థమైందా? అండీ!)

నీవు నీ మనసుకంటే లోపలి వాడవు. నీ మనసే నీకు బాహ్యం అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ సాధనలు ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే? నీ బయట అంటే ఇల్లు, వాకిలి, కుటుంబం చూపెడుతున్నావు ఇప్పటివరకు. ఇల్లు వాకిలి కుటుంబం కాదు. నీ మనసే నీకు బయిటిది. నీ మనసుకంటే లోపలివాడవు నువ్వు. అర్థమైందా? అండీ!

ఇప్పుడు నీ ఇల్లు ఏది?
హృదయం.
నీ స్వస్థానం ఏది?
హృదయం.
నీ నివాసం ఏది?
హృదయం.
నీ ఇల్లు ఏది? 
హృదయం.
నీ సంసారం ఏది?
మనస్సు. (అర్థమైందా? అండీ!)

నీ సంసారం బయిట వుందా? లోపల వుందా?
లోపల వుంది. మనస్సే నీ సంసారం. (అర్థమైందా? అండీ!).
నీ ఇల్లు ఎక్కడ ఇప్పడు?
హృదయం స్థానం.
నీ సంసారం ఎక్కడ వుంది?
నీకు బయిట వుంది. నీ లోపల లేదు.
అంటే ఎక్కడ వుంది?
మనసుగా వుంది. అంతేగాని శరీరానికి బయిట వున్న సంసారం కాదు. (అర్థమైందా? అండీ!) శరీరానికి బయిట వున్నటువంటి కుటుంబము, ఇల్లు, వాకిలి, ఏడంస్తుల మేడ, ఏడంతుస్తుల మేడ లేకపోవడం .... అర్థమైందా? అండీ! ఇవేమీ అక్కడ లెక్కలో లేవు.

ఎందుకనిట? 
అదంతా ఇంద్రియ వ్యాపారం.

మనం ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం?
హృదయము, మనస్సు మధ్యలో మాట్లాడుతున్నాం. (అర్థమైందా? అండీ!)

నా నివాసం ఎక్కడ?
మరచితి నా మందిరంబు ఎక్కడ?
హృదయం. అది నీ మందిరం అది. (అర్థమైందా? అండీ!)

ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే మీలో వున్నటువంటి ప్రాణము, మనస్సు మీలో ఎందుకు పనిచేస్తున్నాయి?

ప్రాణము, మనస్సు మీరు చెబితే పనిచేస్తున్నాయా? ఈశ్వరకృప వల్ల పనిచేస్తున్నాయా?
ఈశ్వరకృప వల్లేనా ప్రాణము, మనస్సు పనిచేస్తున్నది?!

ఎందుకు?
నీ హృదయస్థానాన్ని నీకు తెలియజెప్పటానికి.
ఇప్పుడు ఈశ్వరకృప అంటే ఏమిటి?
నీ హృదయస్థానాన్ని నీకు తెలియజెప్పడమే ఈశ్వరకృప అంటే.
ఎక్కడ నుంచో పైనుంచి వర్షంలాగా నీ మీదేమీ పడదు. పిడుగులాగా అంతకంటే పడదు. (అర్థమైందా? అండీ!) 

మీరేం చేయాలి?
మీలో వున్నటువంటి ప్రాణాన్ని, మనస్సుని సహజంగా వుండేటువంటి దశలో వాడుకున్నట్లైతే, అవి ఒక దశలోకి వెళ్ళేటప్పుడు ఏమైపోయినాయి? ఒక స్థానంలో లయించిపోయినాయి. నిలబడిపోయినాయి. చలనము లేకుండా అయిపోయినాయి. ఆ స్థితి పేరు హృదయస్థానం. ఆ స్థానం పేరు హృదయస్థానం. (అర్థమైందా? అండీ!) అక్కడ మీరు సదా నిలబడి వుండాలి. అక్కడ నిర్విషయంగా వుండాలి. అక్కడి నుంచి విజృంభించేటటువంటి ప్రాణమనస్సులని నిరోధించాలి. అర్థమైందా? అండీ!

నిరోధించాలి అంటే ఏం కావాలి?
అభ్యాస, వైరాగ్యాలు కావాలి. ఈ నిరోధం పేరే యోగం. హృదయస్థానంలో నిలబడి వుండి, ప్రాణ-మనస్సుల యొక్క విజృంభణని అడ్డుకోవటమే, నిశ్శేషముగా అడ్డుకోవటమే, దాని పేరే యోగం. (అర్థమైందా? అండీ!)

యోగం అంటే ఏముండాలి?
అభ్యాసం వుండాలి, వైరాగ్యం వుండాలి. ఈ రెండు లక్షణాలు వుంటేనే యోగం. ఈ రెండు లక్షణాలలో ఏ లక్షణం లేకపోయినా, అది యోగం అవ్వదు.

యోగంకాకపోతే ఏం అవ్వదు ఇప్పుడు?
నిరోధించలేవు.

నిరోధించలేకపోతే ఏమైంది?
మళ్ళా విజృంభించినాయి. (అర్థమైందా? అండీ!) ఇప్పుడు. ఇలా మీరు తెలుసుకోవాలి.
ఇక్కడ రెండు పదాలు వాడాడు. విసర్జించటం, నిరోధం. చాలా ముఖ్యమైన పదాలు.

ఎక్కడ విసర్జించటంపెట్టాడు?
మనోస్థానంలో వున్నప్పుడు, విషయాసక్తి వున్నప్పుడు – విషయాసక్తిని విసర్జించమన్నాడు.

విసర్జన అంటే ఏమిటి? మలం విసర్జించిన తర్వాత దాని వంక చూస్తామా? దాన్ని ముట్టుకుంటామా?
ఇక్కడ వదిలితే దానిని తిరిగి తలచకూడదు. ఆ రకంగా విసర్జించినప్పుడు నువ్వు మనసుస్థానం నుంచి హృదయస్థానానికి వెళ్తావు. అయితే రమణమహర్షి ఏం చెప్పాడంటే, హృదయస్థానం నుంచి ఒక రశ్మి బయలుదేరి విజృంభించి మనసుగా మారిందన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ నిరోధించకపోతే మళ్ళీ మనసు అవుతావు. మళ్ళీ మనసైతే మళ్ళీ విషయాసక్తి వస్తుంది. మళ్ళీ విసర్జించడం అంటే మళ్ళీ కుదరదు. ఒకసారి విషయాసక్తిని విసర్జించి, మనసుస్థానం నుంచి హృదయస్థానం చేరితే, అదే ఆత్మబంధం. అట్లా అభ్యాసం చేత, వైరాగ్యం చేత చేరిన తరువాత, మళ్ళీ మనస్సులోకి వెనక్కు రాకుండా వుండటం కోసం, అక్కడ సహజంగా, అణగదొక్కినట్టు కాకుండా నిరోధం చేయాలి. నిరోధం చేస్తే అక్కడ నువ్వు స్థిరపడిపోతావు.

ఎవరైతే అక్కడ స్థిరపడిపోతారో, ఏం చెప్తున్నాడంటే?
అప్పడది ఉత్తమోత్తమమైన స్థానమగుచున్నది.
విసర్జన ఎక్కడ చెప్పారు?
మనసుస్థానంలో వున్నప్పుడు ప్రస్తుతం వున్న విషయాసక్తిని వదలడానికి చెప్పారు.
నిరోధం ఎక్కడ చెప్పారు?
విసర్జించిన తరువాత నువ్వు హృదయస్థానానికి వెళ్తే, అది మళ్ళా విజృంభించి మనసు కాకుండా వుండటం కోసం సహజ నిరోధం చెప్పారు. ఏదైనా ముందు ఆసక్తిని పరిష్కరించాలి. విసర్జించాలి. తరువాత అప్పుడు మనోవేగం తగ్గిపోతుంది. తగ్గిపోయిన దశలో నిరోధించాలి.
5.        తావదేవ నిరోద్ధవ్యం యావద్ధృతి గతం క్షయమ్‌
ఏతద్ జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః ||
హృదయము నందుండు సంకల్పము క్షయమగునంతవఱకును, అంటే మనస్సును నిరోధింప వలయును. ఇదియే జ్ఞానము. ఇదే ధ్యానము. తక్కిన న్యాయము (వాక్యము) లన్నియూ విస్తరమే అంటే అనవసరమే అని భావన.

(అనసరమయ్యేదాక విస్తరించుకోవడమే). వేదాంత విచారణ అంతాకూడా, వీటిని ఏమంటారంటే సూచన వాక్యాలు, లక్ష్యానికి సూటిగా చెప్పేటువంటి వాక్యాలను సూచన వాక్యాలు అంటారు.

ఈ సూచన వాక్యాల యొక్క విస్తారము అంటే వివరంగా చెప్తూ కొద్దీ ఎక్కడిదాకా పోయావు ఇప్పుడు?
చాలా చివరదాకా, జగత్తు చివరిదాకా వెళ్ళావు. అలా చెప్పడం వలన ప్రయోజనం లేదు అంటాడు. నువ్వు అలా ఆలోచించి అభ్యాసం చేశావట చిన్నప్పటి నుంచి.

ఆలోచన మొదట్లో వుండగా నువ్వు ఆ జగత్తు చివరిదాకా వెళ్ళావా?
వెళ్ళలేదు. క్రమేపి బయట దాక వెళ్ళి, బయట నుంచి ఇంకా బయటకు వెళ్ళి, ఫలితంకి వెళ్ళి, ఆ ఫలితం నుంచి వచ్చిన సుఖదుఃఖాలకు వెళ్ళి, ఆ సుఖదుఃఖాలకు కారణం మళ్ళా ఎవడినో చెప్పి ఇలా రాగ ద్వేషాల దాకా వెళ్ళిపోయావు. ఇది విస్తారము అంటే.

దీన్ని (ఈ విస్తారాన్ని) ఎక్కడ కొట్టాలట దెబ్బ?
ఆలోచన మొదలయ్యే స్థానంలోనే నిరోధించ గలుగుతావు కానీ, ఫలిత స్థానంలో నిరోధించటానికి వీలుకాదు.

కాబట్టి నువ్వు నిజంగా ముముక్షువువే గనుక అయితే, ముక్తి నీ లక్ష్యమైతే, తురీయానుభవం నీ లక్ష్యమైతే, నువ్వు ఏం చేయాలి?
హృదయస్థానంలో మూడవస్థలలో నిలబడి వుండాలి. నీ మనసులో ఆలోచన హృదయస్థానంలో తోచినప్పుడు సంకల్పం అని పిలువబడుతుంది. బయటకు వచ్చేస్తే, విషయములోకి వచ్చేస్తే మనసు అని పిలవబడుతున్నది.

అదే (మనసు) హృదయస్థానంలో ఏమని పిలవబడుతున్నది?
సంకల్పం అని పిలవబడుతున్నది.
ఏమిటి తేడా దీనికి దానికి అంటే?
ఇక్కడ విషయం అవ్వగానే, వ్యావృత్తి చెందిందట.
(వ్యావృత్తి) అంటే అర్థం ఏమిటి?
అంటే ఒక గాలి బుడగలో, అంటూ బూరలో గాలి వుందండి.
బూరలో గాలి పరిమితమేనా కాదా?
పరిమితమే.
బూరలో గాలిని విప్పదీసామండీ, ఏమైంది?
ఈ హాలులో వున్న స్థలాన్ని అంతా ఆ బూరలో వున్న గాలి ఆక్రమించింది.
(అర్థమైందా? అండీ!) అది విషయముఅంటే.

విషయముఅంటే ఏమైందట?
ప్రాధమిక దశలో బూరలో వున్నట్టే కనపడింది కానీ వ్యావృత్తి చెందినప్పుడు ఏమైంది?
జగత్తంతా నిండింది. (అర్థమైందా?)

సంకల్పంఅంటే ఏమిటట?
ఒక సూర్య కిరణాన్ని కనుక పట్టగలిగితే, దానికి సంకల్పము అని పేరు. (అర్థమైందా? అండీ!) సూర్యుడి దగ్గరనుంచి అనేక కిరణాలు వస్తున్నాయి కదా!
ప్రకాశం వస్తుందా? ప్రకాశం ఎలా వస్తుంది?
కిరణాల ద్వారా వస్తుంది. ఒక్క సూర్యకిరణము పేరు ఒక సంకల్పం.
అంటే ఇప్పడు మన హృదయస్థానంలో వున్నప్పుడు, బుద్ధి ఎంత సునిశితంగా పనిచేస్తుంది ఇప్పుడు?
ఒక్క సూర్యకిరణాన్నైనా సరే విడదీసి చూడగలగే సామర్థ్యం వచ్చేంత సునిశితత్వముతో పనిచేస్తుంది. అంత తీక్షణంగా పనిచేస్తుంది. అంత వాడిగా వేడిగా పనిచేస్తుంది. అంత సింహ హృదయంతో పనిచేస్తుంది. ఏ ఒక్క ఆలోచనైనా సరే, అలా అలా కదలటాన్ని కూడా అక్కడే గమనించగలుగుతాడు. కాబట్టి, సమిష్టికి సంబంధించింది సంకల్పం అయితే, వ్యష్టికి సంబంధించింది విషయము. ఇప్పుడు సంకల్పమే విషయము అవుతోంది.
హృదయస్థానంలో వుంటే ఏ అవగాహన కలిగింది ఇప్పుడు?
సంకల్పమే విషయం అవుతోంది. (అర్థమైందా? అండీ!)
సంకల్పమే విషయమైనప్పుడు ఏమయ్యావు?
పరిమితమైపోయావు.
అదే, హృదయస్థానంలో సంకల్పస్థితిలో వున్నప్పుడు ఎలా వున్నావు?
సాక్షిగా వున్నావు.
సాక్షికి కూడా ఇప్పుడు ఏం చెబుతున్నాడు?
హృదయస్థానంలో వున్న సాక్షికి కూడా, సంకల్పరూప వ్యవహారం వుంది. ఇంకో మెట్టు పెంచాడు ఇప్పుడు.
ఇప్పటిదాక ఏంచెప్పాడు?
నిర్విషయం మనఃవరకే చెప్పాడు. విషయాలు, విషయాలలో ప్రవర్తించడం, విషయాలలో ఆసక్తి, దానిని విసర్జించటం, ఆ విసర్జించిన తరువాత నిరోధించడం. ఇప్పుడేం చెప్తున్నాడు? నిరోధించావు.

****

ఎందుకు పూజించాలి? రావిచెట్టుని.
ఆ రావి ఆకు నీ హృదయస్థానానికి చిహ్నం. ఆకారమే కాదు, గాలి లేకపోయినా రావి ఆకులు కదులుతాయి. (అర్థమైందా? అండీ!) నేను ప్రాణ నిరోధం చేశాను, మనో నిరోధం చేశాను, విషయాసక్తతను విసర్జించాను, బాగా నిరోధం చేశాను, చిత్త నిరోధం చేశాను, యోగం చేశాను... అని హృదయస్థానంలోకి చేరావు కదా! ఇప్పుడీ హృదయస్థానంలో ప్రాణమనస్సుల కదలిక లేకుండానే సంకల్పంపనిచేస్తుంది. అని గ్రహించగలగాలి. దాని పేరు జ్ఞానం.
హృదయస్థానంలో మూడవస్థలలో సాక్షిగా వుండి, నీలో సంకల్పం యొక్క కదలిక, ఆ సంకల్పం ఎవరి బలం?
ప్రజ్ఞయొక్క బలం. చైతన్యంయొక్క బలం. అది యథార్థంగా చైతన్యం యొక్క శక్తి. ఆ చైతన్యం యొక్క కదలిక సంకల్పం. ఆ చైతన్యం యొక్క సంకల్పాన్ని గనుక నువ్వు పట్టగలిగితే, చూడగలిగితే, తెలుసుకోగలిగితే దానికే జ్ఞానము అని పేరు.
ఇప్పటి వరకు మనం జ్ఞానం అని ఎన్నింటికి పేర్లు పెట్టాము?
చాలావాటికి పెట్టామా? (ఇందాక కూడా చెప్పా) cell phone వాడటం రాకపోతే చెప్తే అది కూడా జ్ఞానమే, ఆయన కూడా గురువే అని చెప్పా. ఇవన్నీ ఎందులోవి? స్థూలం. విషయాలు. అంతేనా? కాదా? బయటకు వచ్చేశావు.

హృదయస్థానంలో నిలబడి వుండడమే గనుక సత్యమనేటట్లయితే, అక్కడ నీకు కలిగిని జ్ఞానం ఏమిటట ఇప్పుడు?
చైతన్య కదలిక అయిన సంకల్పాన్ని నువ్వు సాక్షిగా వుండి తెలుసుకోవడం. చైతన్య వ్యవహారమైనటువంటి, సంకల్పాన్ని నువ్వు హృదయస్థానంలో వుండి తెలుసుకో గలిగినట్లయితే, నీకు జ్ఞానం లభిస్తుంది. ఇది జ్ఞానాన్ని పొందే మార్గం.

ఇది ఎంత సూక్ష్మం?
సూర్యుని యొక్క ఒక కిరణాన్ని పట్టటానికి సరిపోయినంత బుద్ధి కుశలత. బుద్ధికి సూక్ష్మశక్తి వుండాలి. తీక్షణమైన శక్తి వుండాలి. నిశితంగా పనిచేయాలి అది.
ఎంతగా పనిచేయాలంటే?
ఏ సంకల్పం చేత అయితే ఈ అనంత సృష్టి, వ్యక్తం అయ్యిందో, ఆ సంకల్ప స్థానాన్ని, ఆ సంకల్ప స్థితిని, నీ హృదయస్థానంలో గుర్తెరగాలి. (అది హృదయస్థానంలోనే వుంటుంది). అది ఆ గుర్తెరగడం పేరు జ్ఞానం. (అర్థమైందా? అండీ!) సంకల్పాన్ని గుర్తించ గలిగేటటువంటి శక్తి ఏదైతే వున్నదో దాని పేరు జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందినవాడు ముక్తుడు అవుతాడు.

ఎందుకని దీనిని గూర్చి ప్రస్తావిస్తున్నారు? ఇప్పుడు, నీ లక్ష్యం ఏమిటి?
ముముక్షువు అంటే ముక్తి కావాలి.

ముక్తి కావాలంటే ఏం కావాలి?
జ్ఞానం కావాలి.

జ్ఞానం ఎట్లా వస్తుంది?
హృదయస్థానంలో వుండాలి.

హృదయస్థానంలో వుండి, నన్నేం చేయమంటారండీ?
మనసులో వుంటే బోల్డు పనులున్నాయి ఇక్కడ. అంతేనా? కాదా?

ఇప్పటివరకూ మనం చేసింది ఏమిటి?
లేస్తూనే పని, పడుకుంటూ పని, నిద్రలో పని. ఎప్పుడు చూసినా పని, పని, పని. పని రాక్షసులవలె జీవించడమే. అంతేనా? కాదా?

ఎందుకని అంటున్నారు ఆ మాట?
కఠిన శ్రమ రజోగుణం (అర్థమైందా? అండీ!) ఉచితానుచితములు ఎరుగక చేయడం రాక్షసుల పద్ధతి. తమోగుణం.
ఇప్పటివరకూ మనం పనిచేశాం. ఏ లక్ష్యం లేకుండా పనిచేశాం. కాబట్టి ఇప్పుడు మనమందరం ఎవరు?
పని రాక్షసులు. తమోగుణంతో చేశావు నువ్వు ఆ పనిని. (అర్థమైందా? అండీ!) పనిచెయ్యడమే నీ పని అంతే. దానికి ఉచితం, అనుచితం, ఇది ఎందుకు పోతుంది, ఇది ఎందుకు వచ్చింది? నేను ఎందుకు జీవిస్తున్నాను? ఎందుకు నేను పుట్టాను? ఏం ప్రశ్నలు లేవు, విచారణ లేదు. (అర్థమైందా? అండీ!) తమోగుణంతో చేశావు. కాబట్టి దానివల్ల ఏమీ గొప్ప ప్రయోజనం లేదు. అథవా రజోగుణంతో చేశారనుకోండి, కఠిన శ్రమ చేస్తావు. ఆ కఠిన శ్రమ వలన కర్త, భోక్త వస్తారు. విషయ వ్యావృత్తి వస్తుంది. విషయాసక్తత బలపడుతుంది. వీటన్నింటిని విసర్జించాలి. చిత్త నిరోధం చేయాలి. హృదయస్థానంలో నిలకడగా వుండాలి.

(హృదయస్థానంలో) నిలకడగా వుండి ఏం చేయాలి?
చైతన్యము యొక్క కదలిక అయినటువంటి సంకల్పాన్ని గుర్తించాలి. అప్పుడు నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వల్ల నీకు ముక్తి లభిస్తుంది.

హృదయము నందుండు సంకల్పము అన్నారు, సంకల్ప స్థానం మనసు కాదు హృదయము. తరువాత ఆ సంకల్పము క్షయము అగునంతవరకూ ...
హృదయంలో వుండి సంకల్పము క్షయము చేయడం ఎట్లా కుదురుతుంది? మనసులో వుండే, మనసుని విషయాసక్తిని విసర్జించిన తరువాత, మళ్ళీ ఆ మనసునే పనిముట్టుగా వాడుకుంటూ, అక్కడ నిరోధించమన్నారు.

ఎట్లా అంటే?
హృదయస్థానంలో నువ్వు ఎట్లా వున్నావు?
సాక్షిగా వున్నావా? లేదా?
నేను అనే ఉనికి వున్నదా? లేదా?
దానియొక్క వ్యక్తీ కరణ ఏమిటట ఇప్పుడు?
సంకల్పం’. (అర్థమైందా? అండీ!)
సంకల్పాన్ని నిరోధించడం రావాలట ఇప్పుడు.
ఇంతకు ముందు వరకూ దేనిని నిరోధించమన్నాడు?
ముందు విషయాసక్తిని విసర్జించమన్నాడు, తరువాతేమో నిర్విషయం మనః చేయమన్నాడు, చేసిన తరువాత నిరోధించమన్నాడు. సంకల్పమును గుర్తించమన్నాడు. సంకల్పంక్షయించే వరకూ సాక్షి స్పందించకుండా వుండాలట.

చేయడం అంటే ఇక్కడ చేతఏమీ చేయలేడు. ఎందుకు?
సాక్షి – నిష్క్రియం. సాక్షి ఏమీ చెయ్యడు. మళ్ళా క్రిందకు దిగి మనస్సును హృదయంలోకి పట్టుకెళ్తాడే అనుకోండి.
హృదయంలోకి వెళ్ళగానే ఈ మనసు ఏమైపోయింది?
లేకుండా పోయింది. (అర్థమైందా?) కాబట్టి,
ఇక్కడ సాక్షిగా వున్నటువంటి వాడికి, ఒకటే బాధ్యత వుందంట. ఏమిటది?
స్పందించకుండా వుండుట. ఆ సంకల్పం తనంత తానే క్షయించి పోతుంది. (అర్థమైందా? అండీ!)
సూర్యునిలో వున్నటువంటి కిరణరాశి ప్రకాశంగా వ్యక్తమౌతోందండి. ఇప్పుడు నీ దగ్గరకు చేరిన ప్రకాశం 8 ని.ల ముందు సూర్యుడి దగ్గర వుంది. ఇది మనవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి దూరం లెక్కలుగట్టి, కాంతి వేగం లెక్కలుగట్టి తేల్చారు, అవునా? కాదా? అంటే, అక్కడి నుంచి ఇక్కడికి ఆ కాంతి కిరణం చేరడానికి 8 ని.లు సమయం పట్టింది.
దీని తరువాత వచ్చే కిరణం? పాతదా కొత్తదా?
ఎప్పటికప్పుడు కొత్త కిరణమే, అంతేనా? కాదా?
ఆ వచ్చిన కిరణాలను ఎవరే receive చేసుకున్నారు?
మనమే receive చేసుకున్నాం. అవునా? కాదా?
ఇప్పుడు నీ నుంచి మళ్ళా కిరణాలు బయటకు వస్తున్నాయా?
ఇహ రావడం లేదు. కాబట్టి కిరణాలు క్షయం అయిపోయినాయా లేదా?

కాబట్టి, హృదయస్థానంలో ఏం జరుగుతోందట ఇప్పుడు?
సంకల్పాలు ఉత్పన్నమౌతున్నాయి, ఉత్పన్నమైన చోటే లయించిపోతున్నాయి. లయించిపోయేవరకూ నువ్వు దానికి స్పందించకు.

ఎందుకు గుర్తించాలయ్యా?
సహజంగానే అది లయించిపోతుంది. దాని లక్షణం అది. సంకల్పం ఎక్కడ పుడుతుందో అక్కడే లయించిపోతుంది. సముద్రంలో అల ఎక్కడ పుడుతుందో, అక్కడే లయించిపోతుంది. కాబట్టి హృదయస్థానం పేరు సముద్రం. దానికే క్షీరసాగరము అని పేరు. (అర్థమైందా? అండీ!) అప్పుడే మనసు జోలికి వెళ్ళొద్దు. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సంకల్పస్థానంలో మాట్లాడుతున్నాం. ఇక్కడ మనస్సనే పదంలేదు. హృదయస్థానంలో మాట్లాడుతున్నంతవరకూ ప్రాణమనస్సులు లేవు. కేవలం చైతన్యశక్తి యొక్క అలలే వున్నాయి. అక్కడ అలలు చైతన్య శక్తివి. అవి సంకల్పాలు.

అవి (సంకల్పాలు) ఎక్కడ పుట్టినాయి?
హృదయస్థానంలోనే పుట్టినాయి.
ఎక్కడ ఉడిగిపోతాయి?
అక్కడే (హృదయస్థానంలోనే) ఉడిగిపోతాయి.
నువ్వేమి చెయ్యాలి?
క్షయించేంతవరకూ చూస్తూ వుండు.  (క్షయమగునంతవరకూ నిరోధింప వలయును)
అదిట. నిరోధించడం అంటే అక్కడ నువ్వు ప్రత్యేకంగా ఏమన్నా చెయ్యాలా?
ఇంతకు ముందు చెయ్యొచ్చని చెప్పాడు. అంటే విసర్జించాలి, అలా చెయాలి, ఇలా చేయాలని.
ఇక్కడ నిరోధించడం అంటే అర్థం ఏమిటి?
ఇక్కడ వున్నవాడు ఎవడు?
సాక్షి.
సాక్షిఎలా వుండాలి?
స్పందించకుండా వుండాలి.
సంకల్పానికి స్పందించడమే, తర్వాత దానికి అంతా కారణం అవుతుంది.
కాబట్టి హృదయస్థానంలో సంకల్పాన్ని గనుక గుర్తెరిగిన వాళ్ళు ఎవరైనా వుంటే, వాళ్ళు ఏం చెయ్యాలట ఇప్పుడు? ఆ (సంకల్పం) చైతన్యం యొక్క కదలికకు స్పందించవద్దు. (అర్థమైందా? అండీ!) ఆనంద అపేక్ష, ఆనంద అపేక్ష అని ఇందాకడి నుంచి చెప్పుకుంటున్నామా? ఆ సంకల్పం పేరే ఆనంద అపేక్ష.

ఇప్పుడు నీ గాఢ నిద్రావస్థలో నీవు అనుభవిస్తున్నటువంటి, ఆనందమయకోశ పరిధిలోని ఆనందం ఏమిటి?
ఆ సంకల్పమే.

ఆ సంకల్పం ఉడిగిపోగానే అప్పడేమయ్యింది?
వచ్చేస్తున్నావ్‌, మళ్ళా లైన్‌లో. ఆ సంకల్పానికి స్పందిస్తున్నావ్‌ అన్నమాట అక్కడ. ప్రియం మోదం ప్రమోదాలతో కూడినటువంటి ఆనందమయకోశంలో సంకల్పం కలిగింది. ఆ సంకల్పమే ఆనందం అంటే.
అది ఏమైందంట ఇప్పుడు?

నిన్ను ఇక్కడ స్పందించవద్దన్నాడా సాక్షిని. స్పందిస్తున్నావ్‌.
స్పందించేటప్పటికి ఏమయ్యావ్‌?
మనసులోకి వచ్చావ్‌ - కల అయ్యింది, ఇంకొంచెం దిగావ్‌ - మెలకువలోకి వచ్చావ్‌, శరీరంలోకి వచ్చేశావ్‌.

స్పందించకుండా వుంటే ఏమయ్యావ్‌?
సాక్షిగానే వున్నావు. ఆ ఆనంద అపేక్ష లేకుండా వున్నావు. హృదయస్థానంలో జ్ఞానపూర్వకంగా సాక్షిగా వున్నావు. చైతన్యం యొక్క కదలికలేని సంకల్పాలకు సాక్షిగా వున్నావు.

ఇదే జ్ఞానము. ఇదే జ్ఞానమని మళ్ళా రూఢీ చేస్తున్నాడండీ!
జ్ఞానం అంటే ఏదో అనుకునేరు?!
ఈ సంకల్పాలకు స్పందించకుండా నిలపగలిగే యే స్థితి అయితే వున్నదో, ఆ స్థితియందు వున్నదే జ్ఞానము.

ఇదే ధ్యానము. అదుగోండి, మళ్ళీ! దాన్ని బలపరుస్తున్నాడు ఇంకా. దృఢం చేస్తున్నాడు.
నేను ధ్యానం చేస్తున్నానండీ!” – ఏం ధ్యానం చేస్తావు?
నిర్విషయం ధ్యానం చేయాలి, ఆఁ... Correct అండీ! ‘నిర్విషయం మనః’. నువ్వు మొట్టమొదట ఆ స్థితిని పొందమని చెప్పాడు కదా! మనసులో ఆసక్తతలని, ధ్యానం చేసేటప్పుడు మనసు ఎటుపోతోందో గమనించు. ఆ యా ఆసక్తతను తెలుసుకో! ఆ ఆసక్తతతను వివేకంతో విచారణ చెయ్యి. ఆసక్తతతను విసర్జించు. ఓ పనైంది అక్కడికి. రెండోది ఏం చేయాలట ఇప్పుడు?
విసర్జించిన తరువాత ప్రాణమనస్సులని హృదయస్థానంలో నిరోధించు.
నిరోధిస్తే ఏమైంది?
(సంకల్పాలు కనపడ్డాయి) సంకల్పం గుర్తించావు.
గుర్తిస్తే ఏం చేయాలి?
దానికి స్పందించ కూడదు.
(అదే జ్ఞానము) ఇది జ్ఞానము. ఇదే జ్ఞానము. ఇదే ధ్యానము.
ఇప్పుడింక ఎవరిని అడుగుతావు? ఏం చేయాలని?
జ్ఞానం అంటే ఉత్పన్నమైంది, ధ్యానం అంటే continue అయ్యింది. (అర్థమైందా? అండీ!)
జ్ఞానము అంటే స్థితి (ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి). జ్ఞానము ఎప్పుడూ స్థితి. అనంత సాగర గర్భంలో ఎప్పుడూ ఏముంది?
అలలు వున్నాయా?
లేవు.
నీళ్ళు లేవా?
వున్నాయి. కానీ, నిశ్చలంగా వున్నాయి. అంతేనా? కాదా?
జ్ఞానం అంటే అలా వుండాలన్నమాట. ప్రశాంతము, గంభీరము, నిశ్చలము. (అర్థమైందా? అండీ!) కదలిక కలిగే శక్తిగల నీళ్ళు కదలకుండా వున్నాయి. అక్కడ అర్థం అది.
చైతన్యానికి సహజధర్మం ఏమిటి?

కానీ, హృదయస్థానంలో వున్నప్పుడు ఎలా వున్నదట అది? సాక్షిగా వున్నప్పుడు?
కదలగలిగే శక్తి వుండి, కదలకుండా వున్నది.
జలంఏమిటి? కదలలేని శక్తి, ఉన్నది దానికి జడశక్తి. అసలు కదలలేదు. దాన్ని ఇక్కడ చెప్పటం లేదు.
అనంత సృష్టిని కదిలించగలిగే సామర్థ్యశక్తి వున్నప్పటికీ తాను కదలడం లేదు. జ్ఞానం అంటే అర్థం అది. జ్ఞానం అంటే స్థితి.

ధ్యానము అంటే ఆ స్థితి యొక్క కొనసాగింపు అన్నమాట. ఎప్పటి వరకూ కొనసాగించాలి దీనిని?
ముక్తి. సహజం. ముక్తి అంటే సహజమే.
బంధం అంటే తెచ్చిపెట్టుకోవచ్చు గానీ, ముక్తిని తెచ్చిపెట్టుకోవడం కుదురుతుందా? కుదరదు.
మా ఆయన్ని కట్టుకున్నానండీ, మా ఆవిడని కట్టుకున్నానండీ అన్నట్టుగా ముక్తిని కట్టుకోవడం కుదరదు. అది సహజం. బయట అతుకులు కుదరదు అక్కడ. (అర్థమైందా? అండీ!)
హృదయస్థానంలో నువ్వు సహజంగా వుండాలి. చైతన్యశక్తి యొక్క సంకల్పానికి కదలకుండా వుండాలి. మనో వ్యాపారంలోకి దిగకుండా వుండాలి. విషయాసక్తత చెందకుండా వుండాలి. చిత్తవృత్తి నిరోధం చేయాలి. ఇవన్నీ ఒకే స్థితిలో చెప్తున్నాడు.

ఎక్కడ చెబుతున్నాడు?
హృదయస్థానంలో సదా సంకల్పాలకు స్పందించకుండా వుండాలి. అదే జ్ఞానము, అదే ధ్యానము.

తక్కిన న్యాయములన్నియూ విస్తరమే....
దాని గురించి నువ్వు ఇహ ఎంత ఎక్కువగా చెబితే అంత.
(అనగా అవసరం లేదు అని భావం)
అంటే ఇప్పుడు వెనక్కు తీసుకోవాలా? మనం ముందుకు వెళ్ళాలా?
ముందుకు వెళ్ళాలి.
కానీ, మనం ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాము?
(అవసరం లేదు అనాలి)
ఇందాక చెప్పాను, హృదయస్థానం నుంచి క్రిందకి చెప్తున్నప్పుడల్లా మీరేం చెప్పాలిక? ఇక మాకవన్నీ అవసరం లేదండీ, మేం హృదయస్థానంలో వున్నాం అన్నప్పుడు ఏం చేస్తారిక? పైకి చెప్తారు. బాగా గుర్తుపెట్టుకోండి.
చాలా మందికి వేదాంతం ఎక్కడ నుంచి మొదలుపెడుతుందయ్యా అంటే? మీరు ఆత్మవిషయం చెప్పడంతో అయిపోతుంది అంటారు. అంతేనా? కాదా?
కాదు.
ఉపనిషత్తులు ఆత్మని ప్రతిపాదించడంతో మొదలు పెట్టాయి. ఆత్మా సాక్షీ దగ్గర మొదలుపెట్టి పైకి చెప్తాయన్నమాట. (అర్థమైందా? అండీ!) అదే వేదాంత శాస్త్రంలో వున్నటువంటి గొప్ప విషయం. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, ఈ సృష్టి విజ్ఞానానికి సంబంధించిన ఏ శాస్త్రమైనా సరే సాక్షిత్వదశకు వచ్చేటప్పటికి అయిపోతుంది దానిపని. తర్వాత చెప్పలేదు. కానీ వేదాంత శాస్త్రం ఒక్కటే సాక్షిని ప్రతిపాదించి పైకి చెప్తాయన్నమాట. (అర్థమైందా? అండీ!) కాబట్టి ఇక్కడితో ముగిసింది అనుకోమాకండి.

హృదయస్థానానికి చేరడంతో, నీ దివ్యయానం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ వున్నది ఏమిటి? జీవయానం. అది జీవుడు చేసే ప్రయాణం. ప్రాణమనస్సులను హృదయస్థానానికి చేర్చడం, దానిని విసర్జించడం, విషయాసక్తతని లేకుండా చేసుకోవడం, నిరోధించడం ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు? జీవయానమది. హృదయస్థానంలో వున్న సంకల్పాన్ని ఒడిసిపట్టగలిగి, క్షయించే వరకు దానికి స్పందించకుండా సాక్షిగా వుండగలగడం దగ్గర నుంచి సాక్షిత్వదశ ప్రారంభం అవుతుంది. జ్ఞానదశ ప్రారంభం అవుతుంది. జ్ఞానస్థితి ప్రారంభమైన దగ్గరనుంచి దివ్యయానం ప్రారంభం అవుతుంది. (అర్థమైందా? అండీ!)


6.        నైవ చిన్త్యం నచా చిన్త్యం నచిన్త్యం చింత్యమేవ తత్
పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ స౦పద్యతే తథా ||
భావము : అది అనగా ఆ బ్రహ్మము, చింతింప వీలు లేదు. చింతింప తగనియట్టిదిను కాదు. చింతింప తగినదియునూ కాదు. చింతింప తగినదే. అప్పుడు ఇట్టి జ్ఞాన

((కొందరంటూ వుంటారు, మీరు రెండూ ఒకసారి ఎందుకు చెప్తుంటారు? నా పద్ధతి ఎప్పుడూ ఇలానే రెండూ ఒకసారే చెప్తాను. అంటే ఒకచోట ఎలా చేయకూడదో చెప్తున్నాడు, అదే దాంట్లో ఏం చెప్తున్నాడు? ఏం చెయ్యాలో చెప్తున్నాడు. రెండు ఒకసారే చెప్తాడన్నమాట. అది ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, జీవస్థితిలో........... ))
***

ఇప్పుడు క్షీరసాగర మథనం అంటే ఏమిటి? ఇదే ఈ అమృత బిందు ఉపనిషత్తుకే, పౌరాణిక కాల్పనికత కల్గిస్తే, అది అయ్యింది. సృష్టి ఎట్లా వచ్చింది అంటే ఏం చెప్పారు? పాల సముద్రం మధిస్తే సృష్టి వచ్చింది. అంతేనా? కాదా? మీకందరికీ పురాణం అదేగా చెప్పింది? ఏమిటి అది అంటే ఈ అమృత బిందోపనిషత్తే. మరి హాలహలం మొదట వస్తుంది కదండీ? వస్తుంది అదికూడా చెప్తారు. (అర్థమైందా? అండీ !) ఈ సంకల్పాన్ని నువ్వు క్షయింపజేసేంతవరకు, సంకల్పాల యొక్క కదలిక ఆగిపోయేంత వరకు, మీమీ జ్ఞానస్థితిలో అనంతమైనటువంటి ఈశ్వరకృపని అందుకుంటూ బ్రహ్మానుసంధానం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పడు?
బ్రహ్మమును ఇప్పటి వరకూ ప్రతిపాదించాడా?
ఇక్కడ దాకా ప్రతిపాదించ లేదండీ ఇప్పటివరకూ బ్రహ్మము అనే శబ్దాన్ని వాడలేదు. ఈ బ్రహ్మము అనేటువంటి స్థితి, జ్ఞానాన్ని అందుకోవడంతో ప్రారంభమయ్యింది.

జ్ఞానం నీకు దేనికి ఉపయోగపడుతుందయ్యా?
బ్రహ్మనిశ్చయంచేయడానికి పనికొస్తుంది. వేరేదానికి పనికొచ్చేదేదీ జ్ఞానంకాదు. బ్రహ్మము యొక్క నిశ్చయాత్మకజ్ఞానాన్ని కల్గించేది ఏదైతే వుందో, అదే జ్ఞానము. దాని గురించి చింతించవలసిందేనా? అంటే ఇంద్రియాలతో చింతించుటకు వీలుకాదు. అచింత్యంతో మొదలుపెట్టాడు అందుకనే శ్లోకం. (అర్థమైందా? అండీ!) ఎందుకని నీ దగ్గర ఏమున్నాయి? శరీరం, ప్రాణం, మనస్సు అంటావు,

 ఎంతసేపు చెప్పినా ఏమున్నాయి నీ దగ్గర?
శరీరం, ప్రాణం, మనస్సు.
అచింత్యం – ఈ ఇంద్రియాలతో నీవు దానిని చింతించలేవు.
అని చింతించడానికి వీలుకాదా?
వీలౌతుంది.
ఎట్లా వీలౌతుంది?
హృదయస్థానంలో సంకల్పానికి సాక్షిగా వుండి, స్పందించకుండా వుండి, అది క్షయించిపోయేంతవరకు, అదే గుర్తించనటువంటి దశలో వుండి, ఆ జ్ఞానస్థితిలోనే నిలబడి వుండి, మూడవస్థలలోనూ అదే జ్ఞానస్థితిలో నిలబడి వుండి, సాక్షిగా నిర్ణయించబడినప్పుడు, ఆ తురీయ స్థితిలో, ఆ ఆత్మసాక్షాత్కార జ్ఞాన స్థితితో బ్రహ్మానుసంధానం చేయడానికి వీలౌతుంది. ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేకుండా బ్రహ్మానుసంధానం చేయలేవు. (అర్థమైందా? అండీ!)
ఇట్లా వుండగా ఇప్పుడు ఏం జరుగుతుందంట నీకది?  యోగ లక్ష్యం ఏమిటి? ఆత్మసాక్షాత్కారము. ఈ హృదయస్థానంలో సంకల్పం ఉడిగిపోయేంతవరకూ నీవు నిశ్చలంగా గనుక వున్నట్లయితే, ఇందాకే చెప్పాడు. అదేమౌతుందని చెప్పాడు? ఈ ప్రాణమనస్సుల శక్తులన్నీ కలిసి, ఇంద్రియాల యొక్క శక్తి, ప్రాణమనస్సుల యొక్క శక్తి అంతా కలిసి, ఆత్మరూపాన్ని ధరించి, నీ రూపం నీకే స్వప్రకాశ రూపంలో సాక్షాత్కారజ్ఞానం కలుగుతుంది.
కలిగినటువంటి ఆత్మసాక్షాత్కారజ్ఞానాన్ని ఏం చేయమంటావు?
బ్రహ్మానుసంధానం చెయ్యి.
అచింత్యం- అంటే ఏం చెయ్యాలట?
కిందవాటితో – కింద వున్నటువంటి శరీర ప్రాణ మనస్సులతో చింతించడానికి వీలుకాదు. (అర్థమైందా? అండీ!)
ఆత్మసాక్షాత్కారజ్ఞానంతో బ్రహ్మానుసంధానం గురించి చింతించాలి. మళ్ళా రెండు చింతలు వేశాడు చూడండి.
చింతింప తగని యెట్టిది కాదు, చింతింపదగినట్టిది కాదు final గా సారాంశం చింతింపతగినదే.
ఎందుకనిట? ఎలా తేల్చాడు ఇప్పుడు? అంటే, బ్రహ్మానుసంధానం చేసేటువంటి ఆత్మజ్ఞానము ఏమైందట?
బ్రహ్మమే అయ్యి కూర్చుంది.

ఆత్మజ్ఞానం ఆత్మసాక్షాత్కారజ్ఞానంతో బ్రహ్మానుసంధానం కనుక చేసినట్లయితే ఏది చింతిస్తుంది ఇప్పుడు?
బ్రహ్మమును గూర్చి చింతిస్తోంది.

దేని గురించి చింతిస్తే ఆత్మసాక్షాత్కారం ఏమవ్వాలి? మీరేమవ్వాలి?
యత్‌ భావం తద్భవతి– ఏది భావన చేస్తే అదే నేను అవుతాను.
ఏది చింతన చేస్తే, అదే నేను అవుతాను.

బ్రహ్మమును గూర్చి చింతన చేయగానే నేను ఏమయ్యాను?
బ్రహ్మమే అయ్యాను.

నేను బ్రహ్మమే అయినప్పుడు, నేను చింతగలిగినది, చింతించ తగినది, చింతించతగనిది రెండవది ఏముంది?
కాబట్టి అన్నీ చింతించతగినవే.

ఏ రూపంతో?
బ్రహ్మము అనే స్థితితో.

ఇప్పుడు శరీర ప్రాణ మనస్సులు కూడా ఏమైనాయి?
బ్రహ్మమే అయినాయి.
జీవ జగత్తులు ఏమైనాయి?
బ్రహ్మమే అయినాయి.
విషయాలు ఏమైనాయి?
బ్రహ్మమే అయినాయి.
ఇప్పుడు ఒకే వృత్తి వుంది. బ్రహ్మాకారవృత్తి.
దానిపేరు ఏమిటండీ?
బ్రహ్మాకారవృత్తి. దాని వలన కలిగే జ్ఞానం బ్రహ్మజ్ఞానం. కాబట్టి జగత్‌ జీవ ఈశ్వరులు ముగ్గురూ కూడా, బ్రహ్మము అనేటువంటి జ్ఞానస్థితిలో ఒకటే అయిపోయారు. త్రిపుటి ఏకం అయ్యింది. (అర్థం అయ్యిందా? అండీ!) దీనిపేరు బ్రహ్మం.
ఇక్కడ ఏముంది?
ఒకటే. ఏకాకార వృత్తి. బ్రహ్మాకారవృత్తి.
దానివల్ల ఫలితం?
బ్రహ్మజ్ఞానం.
ఇది ఎక్కడవుండి చేయాలి?
హృదయస్థానంలో వుండి చేయాలి.
దేనికి సాక్షిగా వుండి చేయాలి?
చైతన్యశక్తి అయినటువంటి సంకల్పానికి సాక్షిగా వుండి చేయాలి. సంకల్పం అంటే మీరు మనసు అనుకునే, ఆలోచన అనుకునే తప్పుదారి పడతారు కాబట్టి ఆ మాట అంటున్నాను. అనంత వ్యాపకంగా వున్నటువంటి, సృష్టి అంతా వ్యాపించి వున్నటువంటి, పంచభూతాలలో మొత్తం వ్యాపించి వున్నటువంటి ఏ చైతన్యం అయితే వున్నదో, ఆ చైతన్యశక్తి యొక్క అల సంకల్పం. ఆ చైతన్యశక్తి ఒక మహాసముద్రం వలె వున్నది.
ఆ మహాసముద్రములో నువ్వెలావున్నావు?
సాక్షిగా వున్నావు. కదలకుండా వున్నావు.
అక్కడి నుంచి నువ్వేం చేశావు?
బ్రహ్మానుసంధానం చేశావు.
బ్రహ్మాను సంధానం చేస్తే ఏం తెలిసింది?
నేను బ్రహ్మమే అని తెలిసింది.
నేనే బ్రహ్మమే అని తెలిస్తే ఏమైంది?
నేను చింతించ తగినది కానీ, చింతించ తగనిది కానీ రెండు లేవు. పక్షపాతం లేదు. ఏమైంది అప్పుడు?
ఉన్నదంతా బ్రహ్మమే. అనే ఒక్కటే ఏకాకార వృత్తి మిగిలింది. అది బ్రహ్మాకారవృత్తి.
దాని (బ్రహ్మాకారవృత్తి) వల్ల ఏం లభించింది?
బ్రహ్మజ్ఞానం లభించింది.

అప్పుడు ఇట్టి జ్ఞానం కలవాడైనప్పుడు, పక్షపాతం లేనట్టి బ్రహ్మము అగుచున్నాడు.

7.        స్వరేణ సంధయేద్యోగ మస్వరం భావయేత్పరం
అస్వరేణాను భావేన న భావో భావ ఇష్యతే ||
భావము : యోగమును స్వరముతో అనగా నాదముతో చేర్చవలెయును. బ్రహ్మమును నాద రహితముగా భావింప వలెయును. స్వరరహితముగా భావన చేయుట చేత ఉన్నది (ఆ బ్రహ్మము లేకపోవుట లేదు).

ఇప్పడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? బ్రహ్మానుసంధానం చేయడం ఎలాగా?
నాకేం తెలిసిందండి?
నేను ఆత్మస్వరూపుడనని నాకు నాకే తెలిసింది హృదయస్థానంలో.

మీరు బ్రహ్మానుసంధానం చెయ్యి మంటున్నారు, ఎలా చెయ్యాలి బ్రహ్మానుసంధానం?
ఓంకారాన్ని అనుసంధానం చెయ్యడమే బ్రహ్మానుసంధానం అంటే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి ఉపనిషత్‌ వాక్యాన్ని స్వీకరించి,
బ్రహ్మ స్వరూపం అంటే ఏమిటయ్యా?
అక్షర స్వరూపమే బ్రహ్మస్వరూపము.

అక్షరం ఏంటయ్యా?
ఒక్కటే, ఏకాక్షరము. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ’ – అనేటటువంటి ఓంకారాన్ని అనుసంధానం చేయడమే బ్రహ్మానుసంధానం అంటే.

కాబట్టి ఆ బ్రహ్మానుసంధానానికి నీవు ఎలా వినియోగించాలంట ఇప్పుడు?
యోగంఅంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.

మూడు మాతృకలతో కూడినటువంటి, కార, కార, కార  - మాతృకలతో కూడినటువంటి, ఓంకారానుసంధానం చేస్తేనేమో?
శబ్దబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తున్నట్లు.

ఈ మూడు కాకుండా అర్థానుస్వారము బిందువు దాన్ని లక్ష్యించి, కారం కేవల కారం అంటే అర్థం ఏమిటి?
శబ్దరహితంగా గనుక నువ్వు చేసినట్లయితే, ఆ శబ్దరహిత బ్రహ్మమే నిజమైనటువంటి బ్రహ్మము.

అంటే మళ్ళా బ్రహ్మాన్ని ఏం చేసాడు ఇప్పుడు?
సృష్టి వ్యవహారంతో కూడుకుని వున్నటువంటి, నాదరూపంతో కూడుకుని వున్నటువంటి బ్రహ్మము ఒక స్థితి, నాద రహితమైన స్థతిలో ఒక స్థితి. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ.

ఆయనలోనే మరలా రెండు భాగాలు వున్నాయట. ఎందుకనిట?
అనంత సృష్టి వ్యవహరించడానికి ఒక భాగం పనిచేస్తుంది. అనంత సృష్టి యొక్క వ్యవహారంతో సంబంధం లేకుండా ఒక భాగమున్నది. (అర్థమైందా? అండీ!) ఇలాగ ముందు రెండు భాగాలు తెలుసుకోవాలి, తరువాత ఈ రెండింటికి సాక్షి మూడవ స్థానం. (అర్థమైందా? అండీ!) త్రిపాద ఊర్థ్వగతం బ్రహ్మ - పైకి చూస్తే మూడు పాదములతో వ్యాపించి వున్నది. దాన్ని అకార, ఉకార, మకారాదులని చెప్తున్నారు. ఆ మూడవ భాగంలో అంత్యమైనటువంటి అర్థానుస్వరాన్ని శబ్ద రహిత స్థితిని లక్ష్యించి నువ్వు ప్రయాణం చేస్తే, అప్పుడు నిర్గుణ బ్రహ్మ పదవిని చేరుతావన్నమాటు. అలాంటి లక్ష్యాన్ని ఇప్పుడు విశదీకరిస్తున్నారన్నమాట ఇక్కడ.

ఇప్పుడు యోగ లక్ష్యం మారిపోయిందా? మారిపోలేదా?
ఇంతకు ముందు యోగంఅంటే ఏమిటి?
యోగః చిత్త వృత్తి నిరోధకః. కేవలం విషయాసక్తతను విసర్జించడానికి ఉపయోగపడేది. లేదు దీని ప్రాణ మనో వేగాలను హృదయస్థానంలో నిరోధించేది. అంతవరకే వాడుకున్నావు యోగాన్ని.

ఇప్పుడేం చేశాడు?
హృదయస్థానంలో నిలబడి సంకల్పనిరోధం చేయడం యోగమే.  

ఇంకేం చేశాడట ఇప్పుడు?
ఆత్మసాక్షాత్కారజ్ఞానం కలిగిన దానివల్ల, ఆత్మసాక్షాత్కారం కలిగిన స్థితిలో మళ్ళా యోగం చెప్తున్నాడు ఇప్పుడు.

ఏం యోగం చెప్తున్నాడు?
ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ– ఓంకారోపాసకు సంబంధించినటువంటి యోగాన్ని వివరిస్తున్నాడు. (అర్థమైందా? అండీ!)

ఇది అర్హత ఎక్కడికక్కడ తెలుసుకుంటున్నారు కదా!

ఓంకారోపాసన చేయాలంటే ఏముండాలి మనకి?
ఆత్మసాక్షాత్కార జ్ఞానం వుండాలి. (అర్థమైందా? అండీ!)  ఈ ఓంకారోపాసన పేరే బ్రహ్మానుసంధానం అని అంటారు.

యోగమును స్వరముతో లేక నాదముతో చేర్చవలెయును. బ్రహ్మమును నాద రహితముగా భావింపవలెయును. స్వర రహితముగా భావన చేయుట చేత ఉన్నది (ఆ బ్రహ్మము లేకపోవుట లేదు)”

అంటే వ్యవహరిస్తున్న వాడు లేడన్నమాట. అని అర్థం అక్కడ. నిర్గుణ బ్రహ్మము నందు సగుణ బ్రహ్మమునుకు ఆధారము లేదు. నిర్గుణ బ్రహ్మ విలక్షణంగా వుంది. అంటే అర్థం ఏమిటంటే, ఏక కాలంలో సర్వాధారంగాను వున్నదది. నిరాధారంగా కూడా వున్నదన్నమాట. ఆ స్థితి. శబ్దరహితమైనటువంటి స్థితిలో ఒకే క్షణంలో, సర్వాధారముగా కూడా వున్నది, నిరాధారముగా కూడా వున్నదన్నమాట. ఉన్నది అనుటకు మాత్రమే వీలగుతున్నది కానీ, దానికేమి లేవు? వ్యక్తికరణలు లేవన్నమాట. అంటే పరబ్రహ్మ స్థితి యొక్క ప్రతిపాదన ఇక్కడ వేశాడన్నమాట. ఇక్కడి వరకూ బ్రహ్మము బ్రహ్మము అంటూ ఇప్పుడు దేనికి ప్రతిపాదన వేశాడు? పరబ్రహ్మస్థితికి సంబంధించినటువంటి శబ్దరహిత స్థితి. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అనేది శబ్దబ్రహ్మాన్ని సూచిస్తుంటే, నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే– అనేది నిర్గుణ బ్రహ్మకు సంబంధించినటువంటి వాక్యం అన్నమాట. ఆ నిర్గుణ బ్రహ్మమునే పరబ్రహవాచ్యముగా పిలుస్తారు. కాబట్టి ఆ పరబ్రహ్మ వాచ్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు.
           
            ఉన్నది అనేది ఋజువు కావడం లేదు అలా అని లేకుంటే అని లేకపోవుట లేదు అని అన్నాడు. అంటే ఇప్పటి వరకు ఋజువులు, గుర్తులు దేంతో పట్టుకొచ్చావు?
కిందేమో ప్రాణ మనస్సులతో పట్టుకొచ్చావు. హృదయస్థానంలోకి వచ్చినాక దేనితో పట్టుకొచ్చావు? చైతన్య ఆధారముగా పట్టుకొచ్చావు. చైతన్య ఆధారమంతా సగుణ బ్రహ్మముగా నున్నది. చైతన్యం రహితమైనటువంటి స్థితిలో ఎలా వున్నావు? ఆత్మ లేవు ఏమీ లేదు అక్కడ. ఆత్మ అంటేనే చైతన్యం. ఆత్మ అన్నా చైతన్యం అన్నా రెండూ ఒకటే. సాక్షి అన్నా నేను అన్నా ఆత్మ అన్నా చైతన్యం అన్నా ప్రజ్ఞ అన్నా అన్నీ ఒకటే ఇవన్నీ ఒకే సమానార్థకాలు. స్థితి భేదం చేత ప్రయోగించ బడ్డాయి అన్నమాట.

నిర్గుణ బ్రహ్మ స్థానంలో ఏం లేదయ్యా?
ఏ చైతన్యమూ లేదు. ఏ వ్యవహారము లేదు. అటువంటి వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ వాచ్యాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. దాని విషయం పైకింకా తరువాత మాట్లాడితే మాట్లాడవచ్చు. లేకపోవుట లేదు అనకపోతే అసలు మోక్షం లేదు. (అర్థమైందా? అండీ!) ఈ పరబ్రహ్మవాచ్యాన్ని తెలుసుకోవాలన్నట నీకు.

మొదటే చెప్పాడు కదా ! ఏ లక్ష్యంతో చెప్తున్నాడు ఈ ఉపనిషత్తుని?
పరబ్రహ్మవాచ్యాన్ని సూచించడానికి. పరబ్రహ్మనిర్ణయాన్ని తెలియజేయడానికి ఉపనిషత్తు చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడమే మోక్షం అంటే అర్థం. (అర్థమైందా? అండీ!) ఎవరికి వాళ్ళిక్కడ వేరేవాళ్ళు ఎవరైనా వున్నారా ఇక్కడ? నీతో పాటు ప్రయాణం చేసేవాడు ఎవ్వడూ లేడు. నువ్వే ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేయాలో, ఎలా ప్రయాణం చేయాలో, ఏ సాధన చేయాలో, ఏ సాధన చేస్తే ఏ ఫలితం వస్తుందో, ఆ సాధనా స్థితి వల్ల నువ్వు తర్వాత స్థితికి ఏం చెయ్యాలో కూడా, వెంటవెంటనే ఒకదాని తరువాత ఒకటి వరుసగా చెప్తున్నారు. సాధనా క్రమం వుంది, సిద్ధాంత క్రమం కూడా ఇక్కడే వుంది. కాబట్టి ఇవన్నీ ఏ లక్ష్యంతో చెప్పబడుతున్నాయి? పరబ్రహ్మ అనే లక్ష్యంతో, పరబ్రహ్మ అనే నిర్ణయజ్ఞానం పొందాలన్నమాట.

8.        తదేవం నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువమ్ ||

(కాబట్టి ఆ పరబ్రహ్మ వాచ్యమైనదాని యొక్క విశేషణాలు చెప్తున్నారు) నిష్కళం, నిరంజనం, నిర్వికల్పం, బ్రహ్మ అహం ఇతి జ్ఞాత్వా – తనను తాను తెలుసుకునేటటువంటి జ్ఞానం లేదు. బ్రహ్మముఅన్నంత వరకూ ఏముండాలి? తనను తాను తెలుసుకునే జ్ఞానం కూడా వున్నది. పరబ్రహ్మము అన్నప్పుడు ఏమైంది? తనను తాను గుర్తించే జ్ఞానము కూడా లేదు. (అర్థమైందా? అండీ!)
నిష్కళం – అంటే ఏమిటి?
ఈ సృష్టి మొత్తము కూడా కళ, కాలము, చిత్‌ , తమస్సు, పరశివం అనేటటువంటి ఐదు భాగాల చేత ఏర్పడింది అనంత విశ్వము కూడా. ఆ కళ అనేది నిష్కళ అయిపోయింది. సంకల్ప వికల్పాత్మకం చేత అనంత సృష్టి ఉత్పన్నం అయ్యింది. అది నిర్వికల్పం అయిపోయింది. (అర్థమైందా? అండీ!)

నిరంజనం – నిరంజనం అంటే అర్థం ఏమిటి?
అంజనంఅంటే ఆనందభావం. ఆనందభావం రహితం అయిపోయింది. పరబ్రహ్మస్థితిలో.

కాబట్టి ఇప్పడు ఏమి లేదక్కడ?
సచ్చిదానంద శబ్దంలో వున్నటువంటి ఆనంద శబ్దం లేకుండా పోయింది.

చిత్‌’ – అనే వ్యవహారం సగుణ బ్రహ్మములోనే పోయింది.

సద్‌ రూపం అయినటువంటి బ్రహ్మము ఏమయ్యాడంట? ఇప్పుడు.
పరబ్రహ్మం అయ్యాడు.

ఏ లక్షణాలతోటి (పరబ్రహ్మం అయ్యాడు)?
నిష్కళ, నిరంజనం, నిర్వికల్పం. (అర్థమైందా? అండీ!)నేను బ్రహ్మమని చెప్పేటటువంటి వాడే లేకుండా పోయాడు. అహం ఇతి జ్ఞాత్వా – తన్ను తాను తెలుసుకునే వాడే లేడు పరబ్రహ్మ స్థితిలో.

బ్రహ్మ సంపద్యతే ధృవం’ “ధృవం– అంటే?
మార్పు చెందనిది. ధృవం అంటే మార్పు చెందనిది. కాబట్టి పరబ్రహ్మం అంటే అర్థం ఇది. ఈ పరబ్రహ్మమనే, ధృవం అనేటటువంటి లక్ష్యంలో ఈ ఉపనిషత్తు బోధిస్తూ వున్నది.

ఇట్టి ఆ బ్రహ్మము – బ్రహ్మము నిష్కళముగాను, నిర్వికల్పముగానూ, నిరంజనము గాను అనగా శాంతమైనది, మనస్సునకు కార్యము లేనిది ఉన్నది – ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకొనిన యెడల సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు

ఇదంతా ఎవడికి చెప్తున్నాడు?
సాధకుడు మళ్ళీ. (అర్థమైందా? అండీ!) దీన్ని వదిలేసి పైకి వెళ్ళాం.

ఎక్కడున్నాడు ఇప్పుడు హృదయంలో? ఏ సాధనైతే బ్రహ్మనుసంధానం చేస్తున్న సాధకుడు పరబ్రహ్మ వాచ్యం తెలసుకోగానే ఏమయ్యాడు?
తానే లేకుండా పొయ్యాడు. పరబ్రహ్మ వాచ్యం తెలియనంత వరకూ, తాను బ్రహ్మముగా వున్నాడు. (అర్థమైందా? అండీ!) విషయవ్యవహారాన్ని కలిగినప్పుడు జీవుడుగా వున్నాడు. ప్రాణమనస్సులతోటి విషయవ్యవహారం వ్యావృత్తి కలిగినవాడు జీవుడు. హృదయంలో సంకల్ప వ్యావృత్తి కలిగినవాడు బ్రహ్మము. (అర్థమైందా? అండీ!) ఈ రెండు వ్యావృత్తులు లేని వాడు పరబ్రహ్మ. నేను అనేవాడు అన్ని దశలలో కూడా సాక్షిగా వుండి, సాక్షిత్వమును పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి, ఉన్నాను అనే దానికి (స్థితికి) వచ్చి ఏమీ చెయ్యని వాడు అయ్యాడు. లేదంటే మళ్ళీ మోక్షం లేదు, బ్రహ్మ లేదు. అందుకని లేకపోలేదు, ఉన్నదని ఏమీ చెయ్యడని, నిర్వికల్పం అని, నిరంజనం అని ఇన్ని మాటలు చెప్పాల్సివస్తుంది.
మళ్ళీ నేనుకు ఎందుకు అనుసంధానం చేశాడు?
నీ కంటే వేరుగా అది వున్నదని గుర్తు తెచ్చుకుంటే, అద్వైత సిద్ధి జరగలేదు. మళ్ళీ నేనును తీసుకువచ్చాడు. కనుక సాధకుడే ఇవన్నీ అయ్యాడు, చివరికి సాధకుడే లేకుండా పోయాడు అనకూడదు. సాధకుడే ముక్త స్థితిలో ఇది అయ్యి ఉన్నాడు. అయ్యి వున్నాడని చెప్పడానికి లేదు. అయ్యి వున్నాడు.


9.        నిర్వికల్ప మనంతం చ హేతు దృష్టా౦త వర్జితం
అప్రమేయ మనాదిం చ యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః ||
ఏ బ్రహ్మము నిర్వికల్పము అయినదో, కారణము లేనిదో, ప్రమాదము లేనిదో, ఊహింపనలవి కానిదో, అనాది అయినదో, దానిని జ్ఞాని అయినవాడు తెలుసుకొని, బంధము నుండి తొలగుచున్నాడు.
బంధం తొలగించుకోవడం లేదు, బంధం నుంచి తొలగుచున్నాడు.
అంటే వాడు లేకుండా పోతున్నాడా? బంధం తొలగిపోతుందా?
వాడు లేకుండా పోతేనేమో జన్మరాహిత్యము. కేవలం బంధం తొలగితే మాత్రం ముక్తి’. (అర్థమైందా? అండీ!) ఇక్కడున్న ఈ రెండు శ్లోకాలని జన్మరాహిత్య పద్ధతిగా అంటే మోక్షం అనే లక్ష్యంతోటీ చెప్పవచ్చు. ముక్తి అనేటటు వంటి లక్ష్యంతోటి చెప్పవచ్చు. కేవలం జీవుడు, బ్రహ్మము మధ్యలోనే విచారణ చేస్తేనేమో ముక్తి. బ్రహ్మము, పరబ్రహ్మము మధ్య విచారణ చేస్తేనేమో జన్మరాహిత్యం. (అర్థమైందా? అండీ!)
ఈ పదాలే. వీటినే సంకల్పంతో వ్యవహరిస్తున్నవాడు బ్రహ్మమని నిర్ణయం చేసి, ఆ సంకల్పము, వికల్పము, నిర్వికల్పము మధ్యలో మాట్లాడితే, జీవ-బ్రహ్మల మధ్యలో మాట్లాడుకుంటే, అది ముక్తి అవుతుంది.
అదే ఇందాక చెప్పినట్లుగా నీవు ఎవరివయ్యా?
అనంత విశ్వానికి సంకల్ప వ్యవహారంతో వున్నటువంటి, నిర్గుణ బ్రహ్మను నేను కాదు. సగుణ బ్రహ్మను కూడా నేను కాదు, నేను పరబ్రహ్మమును. నాలో రెండు లేవు. నేను లేనివాడను. అనే దశ దాకా వచ్చేశాడు అనుకోండి. బంధములు తొలగును. భ్రాంతి తొలగిపోవును. (అర్థమైందా? అండీ!)

మోక్షస్థితిలో ఏమైంది? నువ్వే లేకుండా పోయావు. నువ్వు లేకుండా పోయిన తరువాత నిన్ను పట్టేది ఏది?
ఉన్నానుఅంటే పట్టుకుంటుంది కానీ, మాయ అయినా భ్రాంతి అయినా, భ్రమయైనా ఎవరిని పట్టుకుందట?
ఉన్నాను అన్నవాడిని పట్టుకుంది. నువ్వు ఏ రకంగానైనా వుండు, జీవుడనుకో, కాసేపు ఈశ్వరుడనుకో, ఇంకోటనుకో ఇంకోటనుకో... ఏ స్థితికాస్థితి నేను కూడా వున్నాను అంటుంది నీతోపాటు అది.
నేనే లేను– అన్నప్పుడు ఏమైంది?
నిన్నుపట్టుకునేది లేకుండా పోయింది. (అర్థమైందా? అండీ!) ఇది అచల పద్ధతిగా మాట్లాడితే. అక్కడ ఆ దశదాక వచ్చినవాళ్ళు వున్నారు కాబట్టి ఆ చివరి మాటలు కూడా చెప్తున్నాను. తెలుసుకుంటే మంచిదే.

10.      న నిరోధో న చోత్పత్తిః నబద్ధో న చ సాధకః
న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థతా ||     
ఈ పరబ్రహ్మ స్థితిలో వుంటే ఏవేవి లేవయ్యా? ఏవీ లేవు. న సాధకః – సాధకుడు కూడా లేడు. నాశనము లేదు, ఉత్పత్తి లేదు. ఆది లేదు, అంతం లేదు. బద్ధుడు కాదు, ఉపాసకుడు కాదు. సాధన చేసేవాడు లేడు. ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. బంధము లేదు, ముక్తి లేదు. ముక్తి కావాలన్న వాడు లేడు, ముక్తి సిద్ధించిన వాడు లేడు. ఎక్కడ? పరబ్రహ్మస్థితిలో. ఇదే నిశ్చయమైన పరమార్థ తత్త్వము. పరమార్థ తత్త్వము. ఎప్పుడైనా ఇదంతా పరబ్రహ్మవాచ్యమండీ. బ్రహ్మవాచ్యానికి పెట్టుకోకూడదండి. ఉపనిషత్తును ఎప్పుడూ కూడా బ్రహ్మవాచ్యానికి ఆపకూడదన్నమాట దీనిని. బ్రహ్మవాచ్యానికి ఆపితే, ఉపనిషత్తుల తరువాత మరొక శాస్త్రం లేదు. ఇదే ఆఖరి శాస్త్రం.

కాబట్టి, ఉపనిషత్తులు ఎప్పుడుకూడా ఎక్కడిదాకా తీసుకువెళ్ళి విడిచిపెడుతాయి నిన్ను?
పరబ్రహ్మస్థితిని నీకు స్పష్టంగా చెప్పి నిన్ను విడిచిపెడుతున్నాయి.

అక్కడ ఎవరు లేరు?
ఎవ్వరూ లేరయ్యా! నువ్వుకూడా లేవు. అక్కడికి విడిచిపెడుతాయి.


11.        ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు
స్థానత్రయవ్యతీతస్య పునర్జన్మ న విద్యతే ||
భా: జాగ్రత్ స్వప్న సుషుప్తుల యందు, మననము చేయదగిన ఆత్మ ఒక్కటే. త్రివిధ జాగ్రత్‌ స్వప్న సుషుప్తి స్థానములను, అవస్థలను, అతిక్రమించినవారికి పునర్జన్మము లేదు.

అదిట సంగతి. ఈ త్రిపుటి గురించి చాలా చోట్ల చెప్తుంటారు కదా! అవస్థాత్రయం గురించి, శరీరత్రయం గురించి, గుణత్రయం గురించి వీటన్నిటిని గురించి ఎందుకు చెప్తున్నారట?

నీకు పునర్జన్మ ఎక్కడినుంచి కలుగుతుంది? మనవాళ్ళందరూ ఒకటి చెప్తున్నారు కదండీ! మీరు పునర్జన్మను నిరూపించండి. నిరూపిస్తే ఏ తగాదా లేదుకదా! మేం ఒప్పుకుంటాం అంటారు. ఇప్పుడు పునర్జన్మను నిరూపించాడా? లేదా? త్రిపుటిలో ఒకదాని తరువాత ఒకటి, ఒకదాన్నుంచి మరొకటి ఉత్పన్నమవ్వడమే పునర్జన్మ అంటే. అంటే ఈశ్వరుడున్నంత వరకూ జీవుడుంటాడు. ఈశ్వరుడు-జీవుడు ఉన్నంతవరకూ జగత్తుకూడా వుంటుంది. ఇది ఒకదానినుంచి మరొకటి జగదుతప్పత్తి స్థితి లయములు జరుగుతూ వున్నాయి. ఈ మూడింటి మధ్య. ఈ మూడింటి మధ్య వున్నంత వరకూ అవస్థాత్రయం వున్నది. ఈ మూడింటి మధ్య ఉన్నంత వరకూ గుణత్రయం వున్నది. ఈ మూడింటి మధ్య వున్నంత వరకూ అన్ని మూడు మూడుగా వున్నవన్నీ వుంటాయి. అవన్నీ వున్నంత వరకూ పునర్జన్మ వుంటుంది.
పునర్జన్మ న విద్యతే’ – న విద్యతే అంటే వుండదు. విద్యతే అంటే వుంటుంది.
(అర్థమైందా? అండీ!)
న విద్యతే – ఎప్పుడు వుండదు?
మోక్షం వస్తే వుండదు. పరబ్రహ్మ నిర్ణయం తెలియడమే మోక్షం.
ఆ పరబ్రహ్మ నిర్ణయజ్ఞానంలో నువ్వు లేని స్థితిలో నువ్వు లేనివాడుగా వుండడం. అట్లా వున్నప్పుడు పునర్జన్మ న విద్యతే. అంటే జగత్-జీవ-ఈశ్వరులనే త్రిపుటి లేదక్కడ. అన్ని త్రిపుటులు లేవు. రహితం. త్రిపుటి రహితం. పరబ్రహ్మములో త్రిపుటి రహితం. (అర్థమైందా? అండీ!)
12.      ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః
ఏకధా బహుధా చైవ దృశ్యతే జల చంద్రవత్ ||
ఇప్పుడు చెబుతున్నాడు. ఏవండీ! ఉన్నదంతా ఆత్మే అన్నారు కదా! ఇప్పటివరకూ. పై విషయం వదిలేశాడిక. ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు.
ఎవరు?
విన్నవాడు.
ఇప్పటి వరకూ ఏం చెబుతున్నారు మీరు?
అంతటా వున్నది ఆత్మ స్వరూపమే. అంతటా సాక్షిగానే వున్నది కదా, ఆ ఆత్మ సంగతి ఏమిటిప్పుడు?
ఏక ఏవాత్మ – అంతటా వున్నది ఒకే ఆత్మ స్వరూపమే.
భూతే భూతే వ్యవస్థితః – అంటే పంచభూతాత్మకముగా, జీవులుగా, జడచేతనాలుగా ఎన్ని రకాలుగా అయినా చెప్పు సృష్టి గురించి.
అన్నింటిలోనూ వున్నది ఏదీ?
ఒకే ఆత్మే.
ఎలాగా?
ఏకదా బహుదా చైవా – ఏకంగా వున్నా, అనేకంగా వున్న
దృశ్యతే జల చంద్రవత్‌ - అంటే అర్థం ఏమిటి?
నీటిలో ప్రతిబింబించిన ప్రకాశము వలె వున్నాడట. (అర్థమైందా?)
ఆత్మ అనేది ఎలా వుంది? ఇప్పుడు.
బ్రహ్మప్రకాశం వీటిలో ప్రతిబింబించింది. అంటే మనసులో, అంతఃకరణలో ప్రతిబింబించింది.
ప్రతిబింబించినప్పుడు దానిపేరు ఏమిటి?
ఆత్మ.
నీ అంతఃకరణ సాక్షిపేరు ఆత్మ. (అర్థమైందా? అండీ!)
ఇప్పుడు ఆత్మజ్ఞానం అంటే ప్రతిబింబ జ్ఞానమే.
ఆత్మసాక్షాత్కారం అంటే అర్థమేమిటి?
అంతఃకరణ సాక్షిని తెలుసుకోవడం.
అంటే ఎక్కడిదాకా మాట్లాడితే?
చివరిదశ వరకూ మాట్లాడితే. పరబ్రహ్మ నిర్ణయం ద్వారా మాట్లాడినవాడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. (అర్థమైందా? అండీ!)
చివరిదశ మోక్షస్థితిని అనుభవించినటువంటి వాడు, నేనే లేనన్నవాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆత్మవిషయం గురించి. అది చంద్రుని యొక్క ప్రతిబింబం లాంటిది. సూర్యప్రతిబింబం కాదిప్పుడది, ఇంతకు మొదలుపెట్టినప్పుడు ఏం చెప్పాడు? సూర్యప్రతిబింబం అన్నాడు. అన్నప్పుడు బలంగా వుంది. మనోవ్యాపారం వుందన్నమాట అక్కడ. ఇప్పుడిక్కడ ఏమైపోయింది? చైతన్యరహితం అయిపోయి వున్నాడు.  చైతన్యరహితం, సంకల్ప రహితం, నిష్కళం, నిర్వికల్పం, నిరంజనం ఈ స్థితినుంచి ఇప్పుడు సృష్టి సంగతి మాట్లాడుతున్నాడు.
ఈ సృష్టి అంతా ఎలా వుందయ్యా?
జలంలో ప్రతిబింబించినటువంటి చంద్ర ప్రతిబింబంగా పేలవంగా వుంది. జలంలో చంద్రప్రతిబింబం స్పష్టంగా వుంటుందా? అలా వున్నదయ్యా!
భూతములకు ఆత్మయైన వాడు ఒక్కడే ప్రతి భూతము నందు వున్నాడు. జలము నందు చంద్రుని వలె ఒకటిగాను, అనేకముగానూ కూడా కనపడుతున్నాడు.
ప్రతిబింబం అన్నప్పుడు ఏకమన్నా, అనేకములన్నా ఏవైనా ప్రతిబింబములే కదా!

13.      ఘటసంభృత మాకాశం లీయమానే ఘటే యథా
ఘటో తీయేత నాకాశ స్తవద్వజ్జీవో నభోపమః ||
భా. ఘటమును తీసుకుని పోవునపుడు అందుండు ఆకాశమును కొనిపోవుట లేదు.
అది. ఇందాక ఏం చెప్పారండీ ఉపమానం? కుండ వున్నంత వరకూ కుండలో ఆకాశం వుంది. కుండను పట్టుకుపోతే కుండలో వున్న ఆకాశాన్ని కూడా పట్టుకుపోతున్నావా? నీవు. ఆకాశం కదులుతుందా? ఎక్కడైనా? కుండ కదులుతుంది అనవచ్చును కానీ, కుండలో వున్న ఆకాశము కదిలింది అనవచ్చా? (అనరాదు).
భా. ఘటమును తీసుకుని పోవునపుడు అందుండు ఆకాశమును కూడా కొనిపోవుట లేదు. ఘటమును మాత్రమే కొనిపోవునట్లు సజీవుడైన వాడు ఆ ఆకాశమునకు సమానముగా వున్నాడు.
అది సంగతి. ఇప్పుడు ఉన్నాడనా? లేడనా?
ఆకాశ సమానంగా వున్నాడట జీవుడు.
ఇంతకు ముందు ఎలా వున్నాడు?
విషయావృత్తితో వచ్చిన జీవుడు మాట్లాడాడు.
ఇప్పుడు పరబ్రహ్మంలో వున్నటువంటి మోక్షంలో వున్నవాడు జీవుడి సంగతి ఏం మాట్లాడుతున్నాడు?
గగన సదృశంగా వున్నవాడెవడో వాడు జీవుడట ఇప్పుడు. నువ్వు ఏ జ్ఞాతనైతే అక్కడ నిరూపించావో, ఆత్మని అంటున్నావో, ఆ ఆత్మ పరబ్రహ్మనిర్ణయం తెలిసినప్పుడు జీవుడయ్యాడు. బ్రహ్మనిర్ణయంతోటి వుంటేనేమో ఈ ఆత్మే గొప్పది. ముక్తిదశలో.
మోక్షదశలో జన్మరాహిత్యదశలోకి వచ్చేటప్పటికి, అక్కడి నుంచి చూసేవాడికి ఈ జ్ఞాత, ఈ పిండాండ సాక్షి ఎవడైతే వున్నాడో వాడే జీవుడు. ప్రత్యగాత్మ అని ఎవడినైతే అంటున్నావో వాడే జీవుడు. వాడు ఆకాశ సమంగా వున్నాడు.

14.      ఘటవ ద్వివిధాకారం భిద్య మానం పునః పునః
తద్భేదే న చ జానాతి న జానాతి చ నిత్యశః ||
భా. ఘటము వలె శరీరము వివిధములైన ఆకృతి కలది. మరలా మరలా నాశము నొందదగిన శరీరము, తన యొక్క నాశమును తెలిసికొనుట లేదు. వాడు అనగా ఆత్మ, ఆత్మ మాత్రము సదా తెలుసుకొనుచున్నాడు.

అది సంగతి. ఎవడైతే సాక్షిగా వున్నాడో, వాడు తెలుసుకుంటున్నాడు వీటన్నింటిని. మారేవి ఎప్పుడు కూడా తెలుసుకోవడం లేదు.

15.      శబ్దమాయావృతోనైవ తమసో యాతి పుష్కరే
భిన్నే తమసి చైకత్వ మేక ఏవానుపశ్యతి ||
భా. శబ్దాది ప్రపంచమైనట్టి మాయ చేత ఆవరింపబడియుండువాడు, ఆ మాయయనెడి అంధకారమునుండి, ప్రకాశమునకు వచ్చుటయే, ప్రకాశమైన బ్రహ్మమును తెలుసుకొనుటయే లేదు. ఆ అంధకారము తొలగిపోయిన యెడల, ఏకమైన స్థితి ఒక్కడు గానే చూచుచున్నాడు.

 ((చాలు, over flow అయిపోతుంది. మీరు ప్రశాంతంగా మళ్ళా ప్రార్థన చేయండి. గత 3 శ్లోకాల నుంచి ఎవరూ అందుకోవడంలేదు.))


అమృత బిందూపనిషత్

ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహవీర్యం కర వావహై
తేజస్వి నావధీతమస్తు | మా విద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః

అమృత బిందూపనిషద్వేద్యం యత్ పరమాక్షరం
తదేవహి, త్రిపాద్రామ చంద్రాఖ్యం నః పరాగతిః ||

1.         ఓమ్‌ మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ
అశుద్ధం కామసంకల్ప౦ శుద్ధం కామ వివర్జితం ||
భావము : మనస్సు శుద్ధ మనియు, అశుద్ధ మనియు రెండు విధములుగా చెప్పఁబడినది. కోరికలుకల మనస్సు అశుద్ధమును, కోరికలులేని మనస్సు శుద్ధమును అగును.

2.        మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః
బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతమ్ ||
భావము : మనుజుల యొక్క బంధ, మోక్షములకు కారణము మనస్సే అయి యున్నది. విషయములయందు ఆసక్తమైయున్న మనస్సు బంధమును, విషయరహితమైన మనస్సు మోక్షమును పొందును.

3.        యతో నిర్విషయస్యాస్య మనసో ముక్తి రిష్యతే,
అతో నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా ||
భావము : విషయాసక్తముకాని మనస్సునకు మోక్షము కలుగునని చెప్పఁబడినందువలన ముముక్షువు నిత్యము తన మనస్సును విషయరహితముగా చేయవలెను.

4.        నిర స్తవిషయా సఙ్గ౦ సంనిరుద్ధం మనో హృది
యదా యాత్యాత్మన్యో భావం తదా తత్పరమం పదమ్‌ ||
భావము : విషయములందలి ఆసక్తిని వదలి హృదయమందు చక్కఁగా నిరోధింపఁబడి ఎపుడు మనస్సు సదా ఆత్మస్వరూపమును పొందునో అపుడది ఉత్తమమైన పదము (స్థానము) కాఁగలదు.

5.        తావదేవ నిరోద్ధవ్యం యావద్ధృతి గతం క్షయమ్‌
ఏతద్ జ్ఞానం చ ధ్యానం చ శేషో న్యాయశ్చ విస్తరః ||
భావము : హృదయమందలి సంకల్పములు క్షయ మగునంతవఱకు మనస్సును నిరోధింపవలయును. ఇదియే ధ్యానము. ఇదియే యోగము. తక్కిన న్యాయము (వాక్యము) లన్నియు నిస్సారమే కాఁగలవు.

6.        నైవ చిన్త్యం నచా చిన్త్యం నచిన్త్యం చింత్యమేవ తత్
పక్షపాత వినిర్ముక్తం బ్రహ్మ స౦పద్యతే తథా ||
భావము :

7.        స్వరేణ సంధయేద్యోగ మస్వరం భావయేత్పరం
అస్వరేణాను భావేన న భావో భావ ఇష్యతే ||
భావము :

8.        తదేవం నిష్కళం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం
తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువమ్ ||
భావము : ఆ బ్రహ్మము నిష్కళమై, నిర్వికల్పమై, నిరంజనమై యున్నది. ఆ బ్రహ్మమే నేను అని తెలిసికొనిన యెడల మనుజుఁడు సత్యముగా బ్రహ్మమే యగుచున్నాడు.

9.        నిర్వికల్ప మనంతం చ హేతు దృష్టా౦త వర్జితం
అప్రమేయ మనాదిం చ యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః ||
భావము: నిర్వికల్పమై, అనంతమై, కారణ వర్జితమై, దృష్టాంత రహితమై, అప్రమేయమై, అనాదియైనట్టి ఆ బ్రహ్మమును తెలిసికొని జ్ఞాని బంధమునుండి విడివడు చున్నాడు.

10.      న నిరోధో న చోత్పత్తిః నబద్ధో న చ సాధకః
న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థతా ||       
భావము: నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, బద్ధుఁడు లేఁదు, సాధకుఁడు లేఁడు, ముముక్షువు లేఁడు – ఇదియే పరమార్థ తత్త్వము.

11.        ఏక ఏవాత్మా మంతవ్యో జాగ్రత్స్వప్న సుషుప్తిషు
స్థానత్రయవ్యతీతస్య పునర్జన్మ న విద్యతే ||
భావము : మననము చేయఁదగిన ఆత్మ జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులందు ఒక్కటే అయియున్నది. ఆ జాగ్రత్‌, స్వప్న, సుషుప్తులను మూఁడు అవస్థలను దాటిన వానికి పునర్జన్మము లేదు.

12.      ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః
ఏకధా బహుధా చైవ దృశ్యతే జల చంద్రవత్ ||
భావము : ప్రాణులకు ఆత్మయైనది ఒక్కటే. అది సమస్త ప్రాణులందును కలదు. ఆ ఆత్మ నీటి యందు చంద్రుని వలె ఒకటి గాను, అనేకముగాను కనుపించుచున్నది.

13.      ఘటసంభృత మాకాశం లీయమానే ఘటే యథా
ఘటో తీయేత నాకాశ స్తవద్వజ్జీవో నభోపమః ||
భావము : కుండను తీసుకుని పోవునపుడు, అందలి ఆకాశమును తీసికొని పోవుట లేదు. కుండను మాత్రమే తీసికొని పోవుచున్నారు. అట్లే జీవుడు ఆ ఆకాశముతో సమానముగా నున్నాఁడు. (అతఁడు చిదాకాశి స్వరూపుఁడు).

14.      ఘటవ ద్వివిధాకారం భిద్య మానం పునః పునః
తద్భేదే న చ జానాతి న జానాతి చ నిత్యశః ||
భావము : కుండవలె శరీరము వివిధములైన ఆకృతులు కలిగి యున్నది. మరల మరల నాశనము నొందునట్టి శరీరము తన నాశనమును తెలిసికొనుట లేదు. ఆత్మ మాత్రము సదా తెలిసికొనుచున్నది.

15.      శబ్దమాయావృతోనైవ తమసో యాతి పుష్కరే
భిన్నే తమసి చైకత్వ మేక ఏవానుపశ్యతి ||
భావము : శబ్దాది ప్రపంచరూపమాయచే ఆవరింపఁబడి యుండువాఁడు ఆ మాయయగు అంధకారము నుండి ప్రకాశమునకు వచ్చుట లేదు. (ప్రకాశరూప బ్రహ్మమును తెలిసికొనుట లేదు.) ఆ అంధకారము తొలఁగినచో ఏకమైనస్థితిని ఒక్కఁడుగానే చూచుచున్నాఁడు.

16.      శబ్దాక్షరం పరంబ్రహ్మ తస్మిన్ క్షీణే యదక్షరమ్
తద్విద్వానక్షరం ధ్యాయే ద్యదిచ్ఛేచ్ఛా౦తి మాత్మనః ||
భావము : ప్రణవ శబ్దమునందు నాశరహితమైన శ్రేష్ఠమైన బ్రహ్మము కలదు. ఆ ప్రణవ శబ్దము లయించగా ఏ అక్షర పరబ్రహ్మము శేషించుచున్నదో, ఆ నాశరహితమగు పరబ్రహ్మమును ఆత్మ శాంతిని కోరు జ్ఞాని ధ్యానించవలెను.

17.      ద్వే విద్యే వేదితవ్యే తు శబ్దబ్రహ్మ పరం చ యత్
శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరం బ్రహ్మాధిగచ్ఛతి  ||
భావము : రెండు విద్యలను కూడ తెలిసికొనవలెను. శబ్దబ్రహ్మమును గూర్చి పరబ్రహ్మమును గూర్చి. శబ్దబ్రహ్మమును చక్కగా తెలిసికొనిన వాఁడు పరబ్రహ్మమును పొందుచున్నాడు.

18.      గ్రంథ మభ్యస్య మేధావీ జ్ఞానవిజ్ఞాన తత్పరః
పలాల మివ ధ్యానర్థీ త్యజే ద్గ్ర౦థ మశేషతః ||
భావము : బుద్ధిశాలి వేదశాస్త్రాది గ్రంథములను బాగుగ అభ్యసించి జ్ఞాన, విజ్ఞానములందు తత్పరుఁడై, ఆ తదుపరి ధాన్యమును కోరువాఁడు పొట్టును వదిలివేయునట్లు – ఆ గ్రంథముల నన్నిటిని వదిలివేయవలెను.

19.      గవా మనేక వర్ణానాం క్షీరసాపేక్ష్య వర్ణతా
క్షీర వత్పశ్యతే జ్ఞానం లిఙ్గినస్తు గవాం యథా ||
భావము : ఆవులు పలురంగులు కలవి అయియున్నను, వాని యొక్క పాలు ఒకే వర్ణము కలిగియుండు చున్నది. ప్రపంచమందలి బహువిధరూపములు ఆవులు. జ్ఞానరూపమగు ఆత్మ పాలవంటిది.

20.     ఘృతమివ పయసి నిగూఢ౦ భూతే భూతే చ వసతి విజ్ఞానమ్
సతతం మనసి మన్థయితవ్యం మనో మంథాన భూతేన ||
భావము : పాలయందు నేయి నీగూఢముగ నుండునట్లు ప్రతిప్రాణియందును విజ్ఞానరూపమగు ఆత్మ నిగూఢముగ నున్నది. సదా మనస్సును మథించి ఆ ఆత్మయను నవనీతమును వెలువరించవలెను.

21.      జ్ఞాననేత్రం సమాదాయ చోద్ధరేద్వహ్నివత్పరమ్
నిష్కళం నిశ్చలం శాంతం తద్బ్రహ్మాహమితి స్మృతమ్ ||
భావము : మనుజుడు జ్ఞాననేత్రము కలవాఁడై మనస్సును మథించి నిష్కళమై, నిశ్చలమై, శాంతమైనట్టి బ్రహ్మమే నేను అని భావించి ఆ బ్రహ్మము అనుభూత మొనర్చుకొనవలెను.

22.     సర్వభూతాధివాసం చ యద్భూతేషు వసత్యపి
సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవ||
            తదస్మ్యహం వాసుదేవ ఇత్యుపనిషత్ ||
భావము : సమస్త ప్రాణులకు ఆధారముగ నున్నవాడై, సమస్త ప్రాణులందు వసించుచు, సమస్త ప్రాణులను సంరక్షించుచునున్న వాసుదేవుఁడే నేను, ఆ వాసుదేవుఁడే నేను.

ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహవీర్యం కర వావహై
తేజస్వి నావధీతమస్తు | మా విద్విషా వహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః


Download Mp3 (33mb)

***